Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

హీరోయిన్ల కంటే ఎక్కువ అడుగుతున్న రమ్యకృష్ణ -Ramyakrishna Is Demanding More Than Star Heroines ?

ఒక్క బాహుబలి సీరీస్ అందరి జీవితాల్ని మార్చేసింది. తెలుగు శంకర్ అని పేరుపడిన రాజమౌళి దేశంలోనే అతిపెద్ద డైరెక్టర్ గా ఎదిగాడు. ఒక తెలుగు మాస్ హీరో అయిన ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. తెలుగు ప్రేక్షకులకి కూడా అంతంతమాత్రమే తెలిసిన సత్యరాజ్ కాస్త కట్టప్ప పేరుతొ దేశవ్యాప్తంగా పెద్ద పేరు అయిపోయాడు. ఇక అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ వచ్చిన రమ్యకృష్ణ డిమాండ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. నిజం మరి .. ఆవిడ పారితోషకం ఆకాశాన్ని తాకేలా ఉంది.

ఇకనుంచి రమ్యకృష్ణ కథాబలం ఉన్న సినిమాలే చేస్తారట. అది కూడా తన పాత్రకి ప్రాముఖ్యత ఉన్న కథలే. మరి రెమ్యునరేషన్ ఎంత అడుగుతున్నారో తెలుసా ? కనీసం ఊహించగలరా? అది కూడా కష్టం. ఎందుకంటే ఆవిడ డిమాండ్ మన ఊహలకందనిది. అక్షరాల రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నారట ఈ సీనియర్ నటి. అంటే కాజల్, సమంత, రకుల్ ప్రీత్, పూజ హెగ్డే, రాశి ఖన్నా .. ఇలాంటి హీరోయిన్లందరి కంటే ఈ రేటు ఎక్కువ. దక్షిణాదిలో కేవలం నయనతార, అనుష్క రమ్య కంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు.

ఏ మాటకి ఆ మాటే. ఈ రేటు ఆవిడ నిజంగానే అడుగుతున్నారంటే అది టూ మచ్. ఎందుకంటే ప్రతి సినిమా బాహుబలి కాదు, ప్రతి సినిమాలో శివగామి లాంటి పాత్ర ఆమెకి దొరకదు. రమ్యకృష్ణ కోసం థియేటర్లకి వెళ్ళే జనాభా ఎంత ఉంటుంది ? మరి ఆవిడ పేరు మీద టికెట్స్ తెగనప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద డిమాండ్లు ఎందుకో. శ్రీదేవి 8 కోట్లు అడిగి బాహుబలిలో శివగామి పాత్ర పోగొట్టుకుంది. ఆ పాత్ర రమ్యకృష్ణకి దక్కింది. ఆ పాత్ర వలనే రమ్యకృష్ణకి మళ్ళీ డిమాండ్ ఏర్పడింది. కాని శ్రీదేవి చేసిన తప్పే రమ్యకృష్ణ మళ్ళీ చెయ్యట్లేదు కదా?

Continue Reading
More Posts
To Top