సిని ఫీల్డ్ లో అమ్మాయిలను వేధించేది నిజమే అంటున్న రమ్యకృష్ణ

దశాబ్దాల కెరీర్ రమ్యకృష్ణ సొంతం.వందల సినిమాలు, విలక్షణమైన పాత్రలు, అగ్రనటులు, గ్లామర్, అవార్డులు .

 Ramya Krishna Speaks About Harassment On Women In Film Industry-TeluguStop.com

అన్ని చూసారు రమ్యకృష్ణ.ఈ స్థాయికి చేరుకోవడం మామూలు విషయం కాదు.

సినిమా ఇండస్ట్రీ పూలపాన్పు కాదు.ముల్లదారి.

ఎన్ని చూసాంటారు ఇన్ని సంవత్సరాలలో.ఎన్ని కష్టాలను దాటుకొని ఆమె ఓ దిగ్గజ స్థాయికి చేరుకొని ఉంటారు ! ఆ అనుభవంతోనే ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసారు మన శివగామి.

సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిల మీద వేధింపులు నిజమే అని ఒప్పుకున్నారు రమ్యకృష్ణ.

అవును, సినిమా హీరోయిన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని, వేధింపులు చూస్తారని కుండ బద్దలు కొట్టారు రమ్య.

అయితే ఈ హరాస్మేంట్ కేవలం సినిమా ఇండస్ట్రీలోనె కాదు, ఏ ఫీల్డ్ లో అయినా మహిళలకు తప్పదు అంట.ఎవరైతే ఈ విషయాలకి క్రుంగిపోకుండా, అధైర్యపడి ఎవరికీ లొంగకుండా బలంగా నిలబడతారో, వారే పై స్థాయికి చేరుకుంటారని, స్టార్ గా ఎదుగుతారని సెలవిచ్చారు మాహిష్మతి రాజమాత.

అచ్చం రమ్యకృష్ణ లాంటి వాఖ్యలే ఇటీవలికాలంలో యువ హీరోయిన్లు కూడా చేస్తున్నారు.ఏంటో … సినిమా ఇండస్ట్రీ ఇటు కథల పరంగా, మార్కెట్ పరంగా, టెక్నాలజీ పరంగా ప్రగతి సాధిస్తోంది కాని ఈ ఒక్క విషయంలో మాత్రం ఇంకా రాతి యుగంలోనే ఉండిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube