Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

సిని ఫీల్డ్ లో అమ్మాయిలను వేధించేది నిజమే అంటున్న రమ్యకృష్ణ -Ramya Krishna Speaks About Harassment On Women In Film Industry

దశాబ్దాల కెరీర్ రమ్యకృష్ణ సొంతం. వందల సినిమాలు, విలక్షణమైన పాత్రలు, అగ్రనటులు, గ్లామర్, అవార్డులు .. అన్ని చూసారు రమ్యకృష్ణ. ఈ స్థాయికి చేరుకోవడం మామూలు విషయం కాదు. సినిమా ఇండస్ట్రీ పూలపాన్పు కాదు. ముల్లదారి. ఎన్ని చూసాంటారు ఇన్ని సంవత్సరాలలో. ఎన్ని కష్టాలను దాటుకొని ఆమె ఓ దిగ్గజ స్థాయికి చేరుకొని ఉంటారు ! ఆ అనుభవంతోనే ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసారు మన శివగామి. సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిల మీద వేధింపులు నిజమే అని ఒప్పుకున్నారు రమ్యకృష్ణ.

అవును, సినిమా హీరోయిన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని, వేధింపులు చూస్తారని కుండ బద్దలు కొట్టారు రమ్య. అయితే ఈ హరాస్మేంట్ కేవలం సినిమా ఇండస్ట్రీలోనె కాదు, ఏ ఫీల్డ్ లో అయినా మహిళలకు తప్పదు అంట. ఎవరైతే ఈ విషయాలకి క్రుంగిపోకుండా, అధైర్యపడి ఎవరికీ లొంగకుండా బలంగా నిలబడతారో, వారే పై స్థాయికి చేరుకుంటారని, స్టార్ గా ఎదుగుతారని సెలవిచ్చారు మాహిష్మతి రాజమాత.

అచ్చం రమ్యకృష్ణ లాంటి వాఖ్యలే ఇటీవలికాలంలో యువ హీరోయిన్లు కూడా చేస్తున్నారు. ఏంటో … సినిమా ఇండస్ట్రీ ఇటు కథల పరంగా, మార్కెట్ పరంగా, టెక్నాలజీ పరంగా ప్రగతి సాధిస్తోంది కాని ఈ ఒక్క విషయంలో మాత్రం ఇంకా రాతి యుగంలోనే ఉండిపోయింది.

Continue Reading
To Top