"రామ్ మందిరం ఓ సాంస్కృతిక సమస్యట‌....

రామ మందిరం నిర్మాణం నుంచి బిజెపి ప్రస్తుతానికి కొంత వైదొల‌గి నట్టే కనిపిస్తోంది.కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తాము రామ మందిర స‌మ‌స్య‌ని ఒక సాంస్కృతిక సమస్యగా చూస్తున్నట్లు వెల్ల‌డించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

 Ram Temple Is A Cultural Problem …-TeluguStop.com

తన పార్టీ ఓట్ల కోసం మతోన్మాద రాజకీయాలను చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, భార‌తావ‌నిలో మ‌తాల‌ను అడ్డుపెట్టుకునే వ్యక్తులు, గొడ్డు మాంసం, భారత్ మాతా కి జై నినాదం లాంటి వివాదాస్పద ప్రకటనలు చేయడం ద్వేషపూరిత వాతావ‌ర‌ణం క‌లిగించి, లబ్ది చూస్తున్నారని, వీరిప‌ట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

వచ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న‌ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అభివృద్ది నినాదమే త‌మ తార‌క మంత్ర‌మ‌ని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.

బిజెపి నాయకులు పుష్కలంగా పెరిగారని, నేను, నా పార్టీ ప్రచారానికి .అనే నినాదంతో ప్ర‌తి ఒక్క‌రూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా వ్యూహ రచన చేస్తున్నట్లు తెలిపారు రాజ్ నాధ్ సింగ్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube