బీజేపీలో రాముడు, సీత, రావణుడు

వీళ్ళు రామాయణంలో ఉన్నారు కదా.ఈ ముగ్గురు రామాయణంలో హీరో, హీరోయిన్, విలన్ అనే సంగతి అందరికీ తెలుసు.

 Ram, Sita, Ravan Now In Bjp-TeluguStop.com

మరి భాజపాలో చేరడం ఏమిటి అనుకుంటున్నారా? అవును….నిజంగానే చేరారు.

అయితే వీరు దేవుళ్ళు కాదు కదా.కాని ఆ పాత్రలు పోషించిన నటీనటులు.ఒకప్పుడు టీవీలో కొన్నేళ్ళపాటు ప్రసారమైన రామాయణం సీరియల్ చాలా పాపులర్.సూపర్ హిట్ అయింది.అందులో రాముడి పాత్ర వేసిన అరుణ్ గోవిల్ భాజపాలో చేరబోతున్నారు.ఈయన చేరికతో హీరో, హీరోయిన్, విలన్ భాజపాలో ఉన్నట్లు అయింది.

రావణ పాత్రదారి అరవింద్ త్రివేది, సీతగా నటించిన దీపిక చికిలియా గతంలోనే పార్టీలో చేరి రెండుసార్లు పార్లమెంట్ సభ్యులు అయ్యారు.మహాభారతం సీరియల్లో ధర్మరాజుగా నటించిన గజేంద్ర చౌహాన్ భాజపాలో చేరి మంచి పదవి సంపాదించుకున్నారు.57 ఏళ్ళ రాముడు అంటే అరుణ్ గోవిల్ బీహార్ ఎన్నికల ముందు పార్టీలో చేరాలని ప్లాన్ చేసుకున్నారట.ఒకప్పుడు ఈయన కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం చేసారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube