వర్మ నీకిది భావ్యమా?

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏం చేస్తాడో ఆయనకు అయినా తెలుస్తుందో లేదో.తాజాగా ఈయన చేసిన పని ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయ్యింది.

 Ram Gopal Varma Unveils His Own Bruce Lee-TeluguStop.com

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘బ్రూస్‌లీ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.దసరా కానుకగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో చిరు కూడా ముఖ్య అతిథి పాత్రలో కనిపించనున్నాడు.ఆ చిత్ర యూనిట్‌కు షాక్‌ ఇచ్చేలా వర్మ తాజాగా తాను కూడా ‘బ్రూస్‌లీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ ట్రైలర్‌ను విడుదల చేశాడు.

తనకు ఎప్పటి నుండో బ్రూస్‌లీ అంటే అమిత అభిమానం అని, ఆయన పేరుతో సినిమా చేయాలని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.హీరోయిన్‌ ఓరియంటెడ్‌గా ‘రామ్‌ గోపాల్‌ వర్మ బ్రూస్‌లీ’ అంటూ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఆర్టిస్టుగా కనిపించనుందట.వర్మ చేసిన ఈ సినిమా ప్రకటనతో మెగా వర్గాల్లో ఆందోళన నెలకొంది.

వర్మ ఉన్నట్లుండి ఇప్పుడు ఈ సినిమా ప్రారంభించడం వెనుక ఉద్దేశ్యం ఏంటో అని కొందరు అంటున్నారు.సినీ వర్గాలు మరియు మెగా ఫ్యాన్స్‌ వర్మ నీకిది భావ్యమా అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube