స్టార్స్‌ను మించిన స్టార్‌ సంపూ!!

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి వివాదాస్పద ట్వీట్‌ను చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.ఈయన వివాదాస్పద ట్వీట్‌ చేయడం కొత్తేం కాదు.

 Ram Gopal Varma Maintains His Stand On Controversy Tweets-TeluguStop.com

కాని ఈయన ఏం చేసినా కూడా అది చిరిగి చాటంతై వివాదాస్పదం అవ్వడం ఖాయం.తాజాగా ఈయన బర్నింగ్‌ స్టార్‌ సంపూర్నేష్‌బాబును ఆకాశానికి ఎత్తాడు.

తాజాగా ఈయన ‘కొబ్బరి మట్ట’ కోసం పాడిన పాటపై వర్మ ప్రశసంలు కురిపించాడు.సంపూర్నేష్‌బాబు స్టార్‌ అంటూ వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

ఇంత వరకు బాగనే ఉంది.ఆ తర్వాత వర్మ చేసిన వ్యాఖ్యలే ప్రస్తుతం వివాదాస్పంద అవుతున్నాయి.

తన దృష్టిలో చిరంజీవి, రజినీకాంత్‌, అమితాబచ్చన్‌ల కంటే కూడా సంపూర్నేష్‌బాబు గొప్ప అంటూ కామెడీ కామెంట్స్‌ను వర్మ చేశాడు.అన్ని విషయాల్లో కూడా సంపూ వీరి కంటే చాలా ముందు ఉన్నాడని కూడా వర్మ చెప్పాడు.

దాంతో చిరు, రజినీకాంత్‌, అమితాబ్‌ల ఫ్యాన్స్‌ వర్మపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.కనీసం హీరో స్థాయి లేని వాడితో స్టార్‌ హీరోలను పోల్చడం ఏంటని ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వర్మ ఇలాంటి తలతిక్క ట్వీట్స్‌ గతంలో పలు సార్లు చేశాడు.తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలు ఎప్పటిలాగే కొన్ని రోజులకు మామూలు అయ్యి పోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube