సంపూతో కంపు డైరెక్టర్‌

సంపూర్నేష్‌బాబు క్రేజ్‌ రోజు రోజుకు పెరిగి పోతుంది.ఈయన మొదటి సినిమా ‘హృదయ కాలేయం’ సినిమా ప్రేక్షకులను నవ్వించడంతో ప్రస్తుతం ఈయన నటిస్తున్న ‘కొబ్బరి మట్ట’ మరియు ‘సింగం 123’లు ఈయన క్రేజ్‌ను మరింతగా పెంచనున్నాయి.

 Rgv Comedy Horror Movie With Sampoornesh-TeluguStop.com

ఇప్పటికే ఈ రెండు సినిమాల ఫస్ట్‌లుక్‌లు సినిమాలపై అంచనాలు పెంచాయి.ఈ రెండు సినిమాల తర్వాత వర్మ దర్శకత్వంలో సంపూ నటించబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

దేశం గర్వించదగ్గ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్‌గోపాల్‌ వర్మ గత కొంత కాలంగా తాను చేస్తున్న సినిమాలతో కంపూ డైరెక్టర్‌ అనే పేరు తెచ్చుకున్నాడు.అటువంటి కంపూ డైరెక్టర్‌ సంపూతో ఒక సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలను చేస్తున్న వర్మ ఒక కామెడీ హర్రర్‌ సినిమాను సంపూతో ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఒక స్టోరీ లైన్‌ చెప్పి తన శిష్యులతో స్క్రిప్ట్‌ను రెడీ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది.

సంపూతో ఆ సినిమాను కేవలం నెల రోజుల గ్యాప్‌లోనే చేసి విడుదల చేసి ప్రేక్షుల ముందుకు తీసుకు రావాలని వర్మ భావిస్తున్నాడు.సంపూతో కంపూ వర్మ చేయబోతున్న ఈ హర్రర్‌ కామెడీ సినిమా నవ్వించి భయపెడుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube