చరణ్‌ ‘బ్రూస్‌లీ’ కాదు

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు టైటిల్‌ను ఫిక్స్‌ చేయలేదు.

 Ram Charan’s New Movie Title As Fighter..?-TeluguStop.com

ఇప్పటి వరకు పలు టైటిల్‌ను చిత్ర యూనిట్‌ పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.అందులో ఒకటి ‘బ్రూస్‌లీ’.

ఈ సినిమాలో చరణ్‌ ఫైట్‌ మాస్టర్‌గా కనిపించనున్నాడు అని, చిన్నప్పటి నుండి కూడా బ్రూస్‌లీని అభిమానించే పాత్రలో చరణ్‌ నటిస్తున్నాడు అని, అందుకే ఈ సినిమాకు ‘బ్రూస్‌లీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.అయితే ఆ టైటిల్‌ కాదని తాజాగా తేలిపోయింది.

తమిళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవి ప్రకాష్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే.ఆయన ఎంట్రీ మూవీకి ‘బ్రూస్‌లీ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.ఇటీవలే ఆ సినిమా ఫస్ట్‌లుక్‌ కూడా విడుదల అయ్యింది.దాంతో ‘బ్రూస్‌లీ’ టైటిల్‌ను తమ జాబితా నుండి చిత్ర యూనిట్‌ తొలగించినట్లుగా తెలుస్తోంది.

‘నా పేరే రాజు’, ‘నేనే రాజు’ అనే టైటిల్స్‌ ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి.వచ్చే నెలలో చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ఫస్ట్‌లుక్‌ విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

దాంతో అప్పటి వరకు మెగా మూవీ టైటిల్‌ ఖరారు అయ్యే అవకాశాలున్నాయి.రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube