సర్దార్‌ సెట్‌లో చరణ్‌కు ఏం పని?

మెగా ఫ్యామిలీ హీరోల మధ్య విభేదాలు ఉన్నాయి అనే చర్చకు చిరంజీవి 60వ పుట్టిన రోజు సందర్బంగా ఫుల్‌ స్టాప్‌ పడ్డ విషయం తెల్సిందే.పవన్‌ కళ్యాణ్‌ చిరు పుట్టిన రోజు వేడుకకు హాజరు అవ్వడంతో పాటు, ఆ వేడుకలో సందడి చేశాడు.

 Ram Charan Visits Sardaar Gabbarsingh Sets-TeluguStop.com

దాంతో మెగా ఫ్యామిలీలో విభేదాలు లేవు అని తేలిపోయింది.తాజాగా మరోసారి అదే విషయం రుజువు అయ్యింది.

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం నటిస్తున్న ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రం షూటింగ్‌ సందర్బంగా ఆ సెట్‌లో రామ్‌ చరణ్‌ కనిపించాడు.‘సర్దార్‌’ సెట్‌లో చరణ్‌కు ఏం పనా అని అంతా కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు.

మెగా వర్గాలతో పాటు, సర్దార్‌ చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో విడుదల అవ్వబోతున్న ‘బ్రూస్‌లీ’ చిత్రంతో పాటు తాను త్వరలో నటించబోతున్న చిత్రాల గురించి మరియు చిరంజీవి 150వ సినిమా గురించి పవన్‌తో చరణ్‌ సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది.ముఖ్యంగా ‘కత్తి’ రీమేక్‌లో చిరంజీవి నటిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని పవన్‌తో చరణ్‌ సంప్రదించాడు అని అంటున్నారు.

అలాగే వీరిద్దరి మధ్య నిహారిక సినీ ఎంట్రీపై కూడా చర్చ జరిగి ఉంటుందని అంటున్నారు.మొత్తానికి బాబాయి, అబ్బాయి ఏం చర్చించుకున్నారే అనే విషయం అధికారికంగా మాత్రం బహిర్గతం కాలేదు.

కాని ఎవరికి తోచిన ఊహాగాణాలు వారు చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube