రామ్ చరణ్ 'అది' మానేసాడు-ఎవరి కోసం ?

‘బ్రూస్‌లీ’ పరాజయం తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకొని రామ్ చరణ్ తన కొత్త సినిమా ‘ధృవ’ను ఈమధ్యే సెట్స్‌పైకి తీసుకెళ్ళిన విషయం తెలిసిందే.తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

 Ram Charan Turns Vegetarian-TeluguStop.com

ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఓ సరికొత్త లుక్ ప్రయత్నిస్తున్నారు.ఇప్పటివరకూ తన ప్రతి సినిమాలోనూ ఫిజిక్ పరంగా స్ట్రాంగ్‌గా కనిపిస్తూనే, రకరకాల లుక్స్‌తో మెప్పించిన చరణ్, ‘ధృవ’లో ఓ పోలీసాఫీసర్ పాత్రలో మరింత కొత్తగా కనిపించనున్నారట.

ఇక ఇందుకోసం రామ్ చరణ్, ఓ ప్రఖ్యాత ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ ఆధ్వర్యంలో వర్కవుట్స్ చేస్తున్నారు.

అదే విధంగా ప్రత్యేక డైట్ కూడా పాటిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయన పూర్తిగా శాకాహారిగా మారిపోయారు.‘ధృవ’ కోసం శాకాహారిగా మారిపోయిన విషయాన్ని చరణ్ తన ఫేస్‌బుక్‌ పేజీలో స్వయంగా ప్రకటిస్తూ ధృవలో కొత్తగా కనిపిస్తానని తెలిపారు.

రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube