సల్మాన్ కి రామ్ చరణ్ సాయం

బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ కి ఫోన్ చేసాడు.చరణ్ తో మంచి రిలేషన్ మేంటైన్ చేసే భాయ్ ఓ సాయం చేసిపెట్టవలసిందిగా అడిగాడు.

 Ram Charan To Dub For Salman-TeluguStop.com

స్వయంగా సల్మాన్ ఫోన్ చేసి అడిగితె కాదంటాడా, ఎంతమాట చెస్తాను అని బదులిచ్చాడు.ఇంతకి ఏం సాయం అనుకుంటున్నారా ?

విషయంలోకి వెళ్తే, సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ” ప్రేమ్ రతన్ ధన్ పాయో ” వచ్చే నెల దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.అందువల్లనే సల్మాన్ చరణ్ కి ఫోన్ చేసి తన పాత్రకి డబ్బింగ్ చెప్పమని అడిగాడు.చరణ్ అందుకు ఒప్పుకున్నాడు.

సల్మాన్ పాత్రకి చరణ్ గొంతు అంటే తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభవంలా ఉంటుంది.

తెలుగు వెర్షన్ కి అదనపు బలమవుతుంది.సల్మాన్ సరసన సోనమ్ కపూర్ నటించిన ఈ చిత్రానికి సూరజ్ బర్జాతియా దర్శకుడు.

సల్మాన్-సూరజ్ కలయికలో ఇది నాలుగొవ చిత్రం.గతంలో వీరిద్దరూ కలిసి “మైనే ప్యార్ కియా” ,”హమ్ ఆప్కే హై కౌన్” , “హమ్ సాత్ సాత్ హై ” చిత్రాలు వచ్చి మంచి హిట్స్ గా నిలిచాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube