చిరుతో చరణ్ సర్ ప్రైజ్..!-Charan Suprise In Chiranjeevi Khaidi No 150 2 months

Khaidi No. 150 Movie Lawrence Song Composing Ram Charan Special Entry చిరుతో చరణ్ సర్ ప్రైజ్..! Photo,Image,Pics-

మెగాస్టార్ 9 ఏళ్ల తర్వాత చేస్తున్న ఖైది నెంబర్ 150 సినిమాలో మెగా హీరోల సర్ ప్రైజ్ ఎంట్రీ ఉంటుందని ముందునుండి అంటున్నారు. అయితే మిగతా హీరోల సంగతి తెలియదు కాని చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ మాత్రం సినిమాలో కనిపిస్తాడని టాక్. అయితే చరణ్ కనిపించేది కూడా ఓ సాంగ్ లో అట. లారెన్స్ డ్యాన్స్ కంపోజ్ చేస్తున్న ఓ సాంగ్ లో చరణ్ కూడా సర్ ప్రైజ్ ఇస్తాడని అంటున్నారు. ఇక ఈ సినిమా నిర్మాత తనే కాబట్టి సాధ్యమైనంత వరకు మెగా అభిమానులకు ఫీస్ట్ లా ఉండేలా సినిమాను ప్లాన్ చేస్తున్నారట.

మెగాస్టార్ కూడా అదిరిపోయే స్టెప్పులతో అలరిస్తాడని తెలుస్తుంది. ప్రభుదేవ, లారెన్స్ లాంటి స్టార్ కొరియోగ్రాఫర్స్ ను చిరు మళ్లీ తన సినిమా కోసం పనిచేయిస్తుండటం విశేషం. కత్తి రీమేక్ గా వస్తున్న ఈ ఖైది నెంబర్ 150 సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే సినిమాగా తీర్చిదిద్దుతున్నారట. వినాయక్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి టార్గెట్ తో రాబోతుంది.


About This Post..చిరుతో చరణ్ సర్ ప్రైజ్..!

This Post provides detail information about చిరుతో చరణ్ సర్ ప్రైజ్..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Chiranjeevi, Ram Charan, Special Entry, Khaidi No. 150 Movie, lawrence Song Composing, చిరుతో చరణ్ సర్ ప్రైజ్..!

Tagged with:Chiranjeevi, Ram Charan, Special Entry, Khaidi No. 150 Movie, lawrence Song Composing, చిరుతో చరణ్ సర్ ప్రైజ్..!chiranjeevi,Khaidi No. 150 Movie,lawrence Song Composing,ram charan,Special Entry,చిరుతో చరణ్ సర్ ప్రైజ్..!,,