సుకుమార్ కి ఇండియాతో పనిలేదా

జీనియస్ దర్శకుడు సుకుమార్ గత చిత్రాలు 1-నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో రెండు కూడా లండన్ బేస్డ్ కథలు.1-నేనొక్కడినే అయినా ఫస్టాఫ్ ఇండియాలో ఉంటుంది కాని నాన్నకు ప్రేమతో అయితే కంప్లీట్ గా లండన్ లో చుట్టేసాడు సుకుమార్.సినిమా లావిష్ గా ఉండటం కోసమా లేక యాదృచ్ఛికంగానే అలా కథలు రాసుకుంటున్నాడా తెలియదు కాని సుకుమార్ కథల్లో ఇండియా కథావస్తువుగా ఉండట్లేదు.

 Ram Charan – Sukumar’s Film In Usa Backdrop-TeluguStop.com

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ ఒక సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే.

ఇంకా నిర్మాతలు ఖరారు కాని ఈ సినిమా ఇదే ఏడాది అక్టోబరులో మొదలవుతుందని సమాచారం.

అయితే ఈ సినిమా కూడా ఇండియా బ్యాక్ డ్రాప్ లో ఉండదు.

ఈసారి కథ అమెరికాలో నడుస్తుంది.సినిమా అధికభాగం అమెరికాలోనే ఉంటుందని చెబుతున్నారు.

ఇందుకే బీ,సీ సెంటర్స్ లోని ప్రేక్షకులు సుకుమార్ కి దూరం అయిపోతున్నారు.మరి చరణ్ తన మాస్ ఫాలోయింగ్ పక్కనపెట్టి సినిమాను ఎంత లాగుతాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube