శర్వా కోసం చరణ్‌ త్యాగం!!

మెగా హీరో రామ్‌ చరణ్‌ మరియు మరో హీరో శర్వానంద్‌లు మంచి స్నేహితులు అనే విషయం తెల్సిందే.వీరిద్దరి స్నేహం చిన్నప్పటి నుండి కూడా కొనసాగుతూ వస్తోంది.

 Ram Charan Suggests Sharwanand For A Movie-TeluguStop.com

హీరోలు అయిన తర్వాత కూడా వీరిద్దరు సందర్బానుసారంగా కలుసుకుంటూనే ఉన్నారు.తాజాగా తన స్నేహితుడు శర్వానంద్‌ కోసం తన వద్దకు వచ్చిన ఒక అద్బుతమైన కథను త్యాగం చేసినట్లుగా తెలుస్తోంది.

సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం శర్వానంద్‌కు ఒక మంచి కథను సజెస్ట్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

తాజాగా ఒక యువ దర్శకుడు చరణ్‌తో సినిమా చేసేందుకు మంచి కథను రెడీ చేసుకోని వెళ్లాడు.

అయితే కథను నచ్చిన చరణ్‌, ఈ కథ తన కంటే కూడా ఎక్కువగా శర్వానంద్‌కు సూట్‌ అవుతుందని చెప్పాడట.అంతే కాకుండా తానే స్వయంగా శర్వానంద్‌కు ఫోన్‌ చేసి ఒక కథ పంపిస్తున్నాను విను అన్నాడట.

దాంతో ఆ యువ దర్శకుడు శర్వానంద్‌కు కథ వినిపించడం, ఆ కథ ఓకే అవ్వడం త్వరలో షూటింగ్‌ ప్రారంభం కావడం కూడా జరుగనుంది.ఇంత మంచి కథను తనకు సజెస్ట్‌ చేసినందుకు గాను చరణ్‌కు శర్వా థ్యాంక్స్‌ చెప్పాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube