చరణ్‌ మూవీ ఫస్ట్‌లుక్‌ డీటైల్స్‌

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు.ఇప్పటి వరకు ఆ సినిమాకు టైటిల్‌ను ఫిక్స్‌ చేసింది లేదు.

 Ram Charan Movie First Look On Chiranjeevi Birthday-TeluguStop.com

కాని ‘బ్రూస్‌లీ’, ‘నాపేరు రాజు’ అనే టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నాయి.ఇక ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేసినట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజున చరణ్‌ మూవీ టైటిల్‌ను అధికారికంగా రివీల్‌ చేయడంతో పాటు, ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన లుక్‌ ఏది కూడా అధికారికంగా బయటకు వచ్చింది లేదు.ట్రైలర్‌ విడుదకు సరైన సమయంలో చిరు పుట్టిన రోజు అని నిర్ణయించుకుని చిత్ర యూనిట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

చిత్ర యూనిట్‌ సభ్యులు తీసుకున్న నిర్ణయంకు మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.చిరు పుట్టిన రోజు పండుగకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి, దసరా పండుగకు సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.కోన వెంకట్‌ మరియు గోపీ మోహన్‌లు ఈ సినిమాకు స్క్రిప్ట్‌ను అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube