రామ్ చరణ్ ని వాడుకుంటున్న చిరంజీవి

మెగాస్టార్ రీఎంట్రీ మరెంతో దూరంలో లేదు.ఇప్పటికే ముహూర్తం కార్యక్రమాలు జరుపుకున్న ఈ ప్రాజెక్టు, ఇదే నెలలో సెట్స్ మీదకి వెళ్ళనున్నట్లు సమాచారం.

 Ram Charan Special Song In Megastar 150-TeluguStop.com

వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ కత్తి రిమేక్ కి లికా ప్రొడక్షన్స్ తోపాటు రామ్ చరణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తారు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే, ఇన్నీరోజులు తన తండ్రి చిరంజీవిని వాడుకున్నాడు రామ్ చరణ్.

తొలిచిత్రం నుంచి, చిరంజీవి పేరు,చిరంజీవి పాటలు,చిరంజీవి రిఫరెన్స్ దాదాపు తన ప్రతి సినిమాలో పెట్టుకున్నాడు చెర్రి.త్వరలో ఇదంతా రివర్స్ కాబోతోంది.

ఇప్పుడు చరణ్ స్టార్ హీరో.తండ్రి తన స్టార్ కొడుకుని వాడుకోబోతున్నాడు.

విశ్వానీయ వర్గాల సమాచారం ప్రకారం, మెగాస్టార్ 150వ చిత్రంలో చరణ్ ఒక ప్రత్యేక గీతంలో కనిపించనన్నాడు.మెగాస్టార్, మెగాపవర్ స్టార్, ఇద్దరు కలిసి ఒక పాటలో చిందులేయనున్నారు.

హిందీ చిత్రం బంటి ఆండ్ బబ్లీ లో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ “కజ్రారే” అనే పాటలో కలిసి కనిపించిన సంగతి తెలిసిందే.చిరంజీవి – చరణ్ కలిసి డ్యాన్స్ చేసే పాట కూడా అదే పాటను పోలి ఉంటుందని టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube