నిహారిక ఎంట్రీపై చరణ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా నిహారిక ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే బుల్లి తెరపై యాంకర్‌గా తన సత్తా చాటిన ఈ మెగా అమ్మాయి త్వరలో వెండి తెరపై తళుక్కుమనేందుకు రెడీ అవుతోంది.

 Ram Charan Shocking Comments On Niharika Tollywood Entry-TeluguStop.com

మధుర శ్రీధర్‌ మరియు టీవీ9 సంయుక్తంగా నిర్మించనున్న చిత్రంలో నాగశౌర్యకు జోడీగా హీరోయిన్‌గా నటించనుంది.ఇప్పటికే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది.

కొన్ని రోజుల క్రితం టీవీ9లో నిహారిక సుదీర్ఘ ఇంటర్వ్యూ వచ్చింది.ఆ ఇంటర్వ్యూలో స్వయంగా నిహారిక తాను సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించింది.

ఇంత జరుగుతున్న ఈ సమయంలో తాజాగా రామ్‌ చరణ్‌ ఈ విషయంపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు.నిహారిక ఎంట్రీ గురించి మీడియా మిత్రులు చరణ్‌ను ప్రశ్నించిన సమయంలో తనకు ఆ విషయం తెలియదు అని షాక్‌ ఇచ్చాడు.

చరణ్‌ చేసిన ఈ కామెంట్స్‌ ప్రస్తుతం మెగా ఫ్యాన్స్‌లో చర్చనీయాంశం అవుతున్నాయి.నిహారిక స్వయంగా పెదనాన్న చిరంజీవితో పాటు అన్నయ్యలు చరణ్‌, వరుణ్‌లు కూడా తన ఎంట్రీకి ఓకే చెప్పారు అని చెప్పుకొచ్చింది.

కాని చరణ్‌ ఈ కామెంట్స్‌తో ఏదో గందరగోళం తెర వెనుక జరుగుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube