సక్సెస్‌ కోసమే లేట్‌

‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రం తర్వాత రామ్‌ చరణ్‌ నటించిన చిత్రం కోసం మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆ సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు చరణ్‌ తన తర్వాత చిత్రాన్ని మొదలు పెట్టక పోవడంతో ఫ్యాన్స్‌ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

 Ram Charan Planning Two Films In 2015-TeluguStop.com

ఇప్పటికే శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన చరణ్‌, ఆ సినిమా జనవరిలో ప్రారంభం కానుందని ఒక ప్రెస్‌ మీట్‌లో స్వయంగా చెప్పుకొచ్చాడు.అయితే జనవరి వెళ్లి ఫిబ్రవరి వచ్చింది.

అయినా ఇప్పటి వరకు చరణ్‌ సినిమా మొదులు పెట్టింది లేదు.

ఇదే విషయాన్ని కొందరు అభిమానులు తాజాగా చరణ్‌ దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఆలస్యం వల్ల అభిమానులు నిరుత్సాహ పడుతున్నారని, తొందరగా సినిమా ప్రారంభించాలని చరణ్‌ను కలిసిన అభిమానులు అన్నారట.అందుకు చరణ్‌ బదులుగా.

సినిమా తప్పకుండా సక్సెస్‌ అవ్వాలనే ఉద్దేశ్యంతో లేట్‌ చేస్తున్నాం తప్ప మరే కారణం లేదని, మంచి స్క్రిప్‌ రాగానే సినిమాను ప్రారంభిస్తామని ఈ సందర్బంగా చరణ్‌ అభిమానులతో చెప్పుకొచ్చాడట.స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయిన వెంటనే సినిమాను ప్రారంభించి, ఏకధాటిగా షూటింగ్‌ జరిపి, వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చాడట.

ఈ సంవత్సరం తాను రెండు సినిమాలో వస్తానని కూడా చరణ్‌ అన్నాడట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube