రామ్ చరణ్ అతి తెలివితేటలు

ఓక సినిమా సరిగా ఆడకపోతే చాలు, ట్రేడ్ వర్గాల్లో ఆ హీరో స్థాయి తగ్గకుండా, ఆ పరాజయం తాలూకు ప్రభావం వచ్చే చిత్రంపై పడకుండా రకరకాల ఎత్తులు వేస్తుంటారు హీరో పీ.ఆర్ టీం వాళ్ళు.

 Ram Charan In Salman’s Movie Is Intentional Gossip ?-TeluguStop.com

మొన్నటికిమొన్న ప్రభాస్ వార్తల్లో నిలవాలని ధూమ్-4 లో ప్రభాస్ అంటూ మీడియా డప్పు కొట్టేలా చూసుకున్నారు ప్రభాస్ వర్గం వాళ్ళు.అయితే ఇది బాహుబలి విజయాన్ని క్యాష్ చేసుకోవడానికి.

మరోవైపు బ్రూస్ లీ పరాజయాన్ని కవర్ చేసేందుకు అతి తెలివితేటలు వాడుతున్నారు రామ్ చరణ్ పీ.ఆర్ జట్టు సభ్యులు.సల్మాన్ ఖాన్ తో చరణ్ హిందీ సినిమా చేయనున్నట్లు ప్రచారం మొదలుపెట్టారు.ఈ టాపిక్ మీద కథనాలు రాయాల్సిందిగా బాలివుడ్ మీడియాకు కబురు పెట్టారట.అందుకు తగ్గట్టే హిందీ సినిమా వెబ్ సైట్స్ కథనాలు ప్రచురించాయి.

ప్రస్తుతం సల్మాన్ సుల్తాన్ అనే సినిమా చేస్తున్నాడు.

దీని తరువాత నో ఎంట్రీ సీక్వెల్ తో పాటు దబాంగ్-3 చిత్రాలు లైన్ లో ఉన్నాయి.ఇప్పుడప్పుడే సల్మాన్ కొత్త సినిమా ఒప్పుకోడని, ఇదంతా చరణ్ పీ.ఆర్.టీం పనే అని బాలివుడ్ వర్గాలు వాదిస్తున్నాయి.మరి ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియాలంటే, సల్మాన్ లేదా చరణ్ నోరు విప్పాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube