సూపర్‌ మ్యాన్‌గా మెగా హీరో

హాలీవుడ్‌లో సూపర్‌ మ్యాన్‌ పాత్ర ఎంత ప్రాచుర్యంను దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌ మ్యాన్‌ పాత్రకు గుర్తింపు ఉంది.

 Ram Charan As Superman-TeluguStop.com

చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు కూడా సూపర్‌ మ్యాన్‌ను ఇష్టపడుతారు.అద్బుత శక్తులు, అతీత శక్తులు ఉండటం వల్లే సూపర్‌ మ్యాన్‌ను పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడుతారు.

ఇక ఆలాంటి పాత్రతో మెగా హీరో రామ్‌చరణ్‌ ఒక సినిమాలో కనిపించబోతున్నాడంటూ ఫిల్మ్‌ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ నటిస్తున్న సినిమా చివరి దశకు చేరుకుంది.

శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈనెలాకరు వరకు పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.ఇప్పటికే అక్టోబర్‌ 15న సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

ఇక సినిమా తర్వాత చరణ్‌ నటించబోతున్న సినిమాపై కూడా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది.‘కిక్‌ 2’ చిత్రాన్ని త్వరలో విడుదల చేయబోతున్న సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఒక సినిమాలో నటించబోతున్నాడు.

ఆ సినిమాలో చరణ్‌ సూపర్‌ మ్యాన్‌గా కనిపించనున్నాడు.ఆ సినిమాలో చరణ్‌కు అద్బుత శక్తులు ఉంటాయని, ఆ శక్తులు ఎలా వచ్చాయి అనే కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు.

వచ్చే సంవత్సరం వేసవిలో చరణ్‌, సురేందర్‌ రెడ్డిల కాంబినేషన్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube