రకుల్ ప్రీత్ ఐరన్ లెగ్ అంటున్నారు

సినిమావాళ్ళకి మూఢనమ్మకాలు ఎక్కువ, ఒక సినిమా ఫ్లాప్ అయితే, దాన్ని మొదలుపెట్టిన ముహూర్తం బాగాలేదనో, రిలీజ్ చేసిన ముహూర్తం బాగాలేదనో, ఇవన్ని కాకపోతే హీరోయిన్ కాలు మంచిది కాదు అని అంటుంటారు.పాపం రకుల్ ప్రీత్ ని కూడా ఆడిపోసుకోవడం మొదలుపెట్టారు సినీజనాలు.

 Rakul Preeth Is New Iron Leg-TeluguStop.com

తెలుగులో రకుల్ ప్రీత్ మొదటి చిత్రం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మంచి హిట్ సాధించింది.ఆ తరువాత ఫ్లాప్స్ వచ్చినా, లౌక్యంతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటి.

అయితే మళ్ళి రకుల్ సినిమాలేవీ సరిగా ఆడలేదు.పండగ చేస్కో,కరెంట్ తీగ ఎదో అలా వచ్చి ఇలా వెళ్ళాయి.

ఇక కిక్ – 2, బ్రూస్ లీ సంగతి చెప్పాల్సిన పనే లేదు.దర్శకనిర్మాతలతో పాటు హీరో, బయ్యర్లకు .అందరికి చుక్కలు చుపించిన సినిమాలు అవి.ఇప్పుడు రకుల్ కి హిట్ కావాలి.చేతిలో నాన్నకు ప్రేమతో, సరైనోడు ఉన్నాయి.ఈ చిత్రాల షూటింగ్ త్వరలోనే పూర్తీ అవుతుంది.మరి ఆ తరువాత రకుల్ సినిమా ఏంటి ?

గమనిస్తే కొత్త చిత్రాలేవి రకుల్ తలుపు తట్టలేదు.మరి రకుల్ సినిమాలు ఫ్లాప్స్ గా నిలుస్తుండడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర వేసేసారా ? నాన్నకు ప్రేమతో, సరైనోడు మంచి హిట్స్ గా నిలిచి రకుల్ కి కొత్త అవకాశాలు ఇప్పిస్తాయో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube