బ్యాంకాక్ లో రకుల్ ప్రీత్ వ్యాపారం

అందాల తార రకుల్ ప్రీత్ కేవలం తన ప్రొఫెషన్ లోనే కాదు, మరోవైపు వ్యాపారంలో కూడా పది రాళ్ళు వెనక్కి వేసుకుంటోంది.ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన రకుల్ ప్రీత్ కి జిమ్ కి వెళ్ళడం అన్న, జిమ్ లో గంటలకొద్దీ గడపడమన్నా ఎంత ఇష్టమో మనకు తెలిసిందే.

 Rakul Preet To Extend Her Business In Bangkok-TeluguStop.com

అందుకే జిమ్ వ్యాపారాన్ని నడుపుతోంది.హైదరాబాద్ లోని, గచ్చిబౌలి దగ్గర రకుల్ కి F45 అనే జిమ్ ఉంది.

ఈ జిమ్ కి బాగా క్రేజ్ ఉంది.వ్యాపారం కూడా బాగా సాగుతోంది.

ఇప్పటికే బెంగళూరు, ముంబాయి లాంటి నగరాలలో బ్రాంచులు ఓపెన్ చేయాలనే అలోచనలో ఉన్న రకుల్ అక్కడితో ఆగట్లేదట, ఏకంగా బ్యాంకాక్ దాకా తన వ్యాపర కార్యకలాపాలను విస్తిరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు టాక్.అంటే F45 కి బ్యాంకాక్ లో కూడా ఓ బ్రాంచ్ ఓపెన్ చేసే ఆలోచన అన్నమాట.

దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే, రకుల్ లో మంచి నటి మాత్రమే కాదు, బిజినెస్ వుమెన్ కూడా దాగుంది.ఇక సినిమాల విషయానికి వస్తే, మహేష్ బాబు – మురుగదాస్ సినిమా లాంటి భారి ప్రాజెక్టు చేతులో ఉంచుకున్న రకుల్, త్వరలోనే విన్నర్ సినిమాతో మనల్ని పలకరించబోతోంది.

ఇక నాగచైతన్యతో ఓ సినిమా, బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా, మరో తమిళ సినిమా ఈ అమ్మడి జేబులో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube