షాక్‌ ఇస్తున్న లక్కీ బ్యూటీ

నిన్న మొన్నటి వరకు స్టార్‌ హీరోయిన్స్‌గా ఉన్న సమంత, తమన్నా, కాజల్‌లను పక్కకు నెట్టి ప్రస్తుతం రేసులో దూసుకు పోతున్న ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.ఈ అమ్మడు టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్‌ లక్కీ హీరోయిన్‌, మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

 Rakul Preet Singh’s Shocking Remuneration-TeluguStop.com

ఈ అమ్మడు నటించిన వరుస సినిమాలు సక్సెస్‌ అవ్వడంతో చాలా తక్కువ సమయంలోనే రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించే ఛాన్స్‌ కొట్టేసింది.

స్టార్‌ హీరోలకు సైతం డేట్లు లేవు అంటూ చెప్పే స్థాయిలో ప్రస్తుతం రకుల్‌ ఉందంటే ఆశ్చర్యం కాదు.

ప్రస్తుతం ఈమె రామ్‌చరణ్‌తో ఒక సినిమా చేస్తోంది.ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతుంది.

దాంతో మహేష్‌బాబుతో సినిమా ఓకే అయినా డేట్లు కుదరక పోవడంతో తప్పుకుంది.తాజాగా ఈమె అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు కమిట్‌ అయ్యింది.ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు పారితోషికంగా 1.5 కోట్లు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.సమంత, కాజల్‌, తమన్నాలు కూడా కోటికి కాస్త అటు ఇటుగా తీసుకున్నా.కాని రకుల్‌ మాత్రం కోటిన్నర తీసుకుంటూ ఇతర హీరోయిన్‌లు కుల్లుకునేలా చేస్తోంది.మరో వైపు ఈమె తన పారితోషికంతో నిర్మాతలకు షాక్‌ ఇస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube