ముద్దు సన్నివేశాలంటే టెన్షన్ పడుతుందట

హాలివుడ్ లో మొదలై , బాలివుడ్ కి అలవాటైపోయి, మెల్లిగా తెలుగు సినిమాలో సాధారణం అయిపోతున్న సంస్కృతి లిప్ లాక్.మన హీరోలు, హీరోయిన్లు చాలా మందే ముద్దు సన్నివేశాల్లో నటించారు.

 Rakul Responds On Lip Lock Scenes-TeluguStop.com

క్రేజీ భామ రకుల్ కుడా తక్కువేం తినలేదు.బాలివుడ్ లో చేసిన మొదటి సినిమా “యారియాన్” లో ఏకంగా నాలుగైదు చుంబన దృశ్యాల్లో నటించింది.

ఇటు తెలుగులో కుడా ఆదితో, రవితేజతో లిప్ లాక్ చేసింది ఈ భామ.ఆ అనుభవం గురించి రకుల్ ని అడిగితే …

“లిప్‌లాక్‌ సీన్లు వెండితెర మీద బాగా కనిపిస్తాయేమో కానీ, అలాంటి సీన్లలో నటించాలంటే మాత్రం తెగ టెన్షన్‌ అనిపిస్తూంటుంది.ఆ టెన్షన్‌ ఏమాత్రం మొహంలో కనిపించనీయకుండా ఆ సీన్లో నటిం చడం ఎంత కష్టమో హీరోయిన్లకే తెలుసు.అలాంటి సీన్లు చేసేటప్పుడు కుటుంబ సభ్యులు షూటింగ్‌లో ఉంటే ఆ ఇబ్బంది మాటల్లో చెప్పడం కష్టం! నాకు అలాంటి అనుభవమే ఎదురైంది.

ఓ సినిమాలో తప్పనిసరిగా అలాంటి సీన్‌ చేయవలసి వచ్చింది.ఆ సమయంలో మా మదర్‌ షూటింగ్‌ స్పాట్‌లో ఉన్నారు.ఆవిడ ముందు చేయడం కష్టం అనిపించి ఏదో కారణంతో ఆవిడను బయటకు పంపించి ఎలాగో మేనేజ్‌ చేశాను ” అంటూ సమాధానమిచ్చింది రకుల్‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube