సమంతకు అక్కడ ఇక్కడ పోటీ

టాలీవుడ్‌లో ‘ఏమాయ చేశావే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తక్కువ సమయంలోనే టాప్‌ హీరోల మనస్సు దోచి, వరుసగా బిగ్‌ సినిమాల్లో నటించింది సమంత.అతి తక్కువ సమయంలోనే దాదాపు అందరు యువ స్టార్‌ హీరోలతో ఈ అమ్మడు జత కట్టేసింది.

 Rakul And Shruti Giving Competition To Samantha-TeluguStop.com

దాదాపు మూడు సంవత్సరాలు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన సమంత కొన్ని నెలల ముందు తమిళంలో కూడా క్రేజ్‌ దక్కించుకుంది.సొంత భాష సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టిన సమంత తెలుగు సినిమాలను అడపాదడపా ఒప్పుకుంటూ వస్తోంది.

అయినా కూడా ఈమెకు తెలుగులో మంచి క్రేజ్‌ ఉంది.అటు తమిళం మరియు ఇటు తెలుగులో ఈమెకు స్టార్‌ క్రేజ్‌ వచ్చింది.

అయితే ఇప్పుడు పరిస్థితి మారింది.

సమంత క్రేజ్‌ మెల్ల మెల్లగా తగుతూ వస్తోంది.

ఈమెకు అటు తమిళంలో మరియు ఇటు తెలుగులో కూడా కూడా గట్టి పోటీ ఎదురవుతోంది.ప్రస్తుతం తెలుగులో స్టార్‌ హీరోలు అంతా కూడా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వెంట పడుతున్నారు.

తమ సినిమాల్లో రకుల్‌ను ఎంపిక చేసుకుంటున్నారు.సమంతను దాదాపుగా పక్కన పెట్టినట్లే అని విశ్లేషకులు అంటున్నారు.

అటు తమిళంలో అయినా తన సత్తా మరి కొన్నాళ్లు చాటుదామని భావించిన సమంతకు శృతిహాసన్‌ నుండి గట్టి పోటీ ఎదురవుతోంది.ఇప్పటికే సమంతకు దక్కాల్సిన రెండు మూడు సినిమాలను శృతిహాసన్‌ తన ఖాతాలో వేసుకుంది.

భవిష్యత్తులో శృతిహాసన్‌కు తమిళనాట మరింత క్రేజ్‌ పెరిగే అవకాశాలున్నాయి.మరో వైపు సమంత క్రేజ్‌ మెల్లగా తగ్గుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube