చిన్న హీరో పెద్దోడయ్యాడా?

స్టార్‌ హీరోల సినిమాల్లో మాత్రమే ఎక్కువగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్‌లు కనిపిస్తూ ఉంటారు.చిన్న హీరోల చిత్రాల్లో కూడా ఉంటారు.

 Rakul Preet And Pranitha To Romance Nithin-TeluguStop.com

కాని చాలా తక్కువ శాతం సినిమాల్లో మాత్రమే ఇద్దరు హీరోయిన్‌లను చిన్న చిత్రాల దర్శకులు పెడుతారు.ఇప్పటి వరకు ఎక్కువగా ఒక్క హీరోయిన్‌తో మాత్రమే రొమాన్స్‌ చేసిన నితిన్‌ త్వరలో ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్‌ చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

ప్రస్తుతం నటిస్తున్న ‘అఆ’ చిత్రంలో సైతం నితిన్‌ ఇద్దరు హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేస్తుండగా, మరో సినిమాలో హీరోగా నటించబోతున్న నితిన్‌ ఆ సినిమాలో సైతం ఇద్దరు హీరోయిన్స్‌తో కలిసి నటించబోతున్నాడు.

ప్రస్తుతం ‘అఆ’ చిత్రంలో నటిస్తున్న నితిన్‌ ఆ తర్వాత వేణు మల్లిడి దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

వెలిగొండ శ్రీనివాస్‌ కథను అందిస్తున్న ఆ సినిమాను సుధాకర్‌ రెడ్డి శ్రేష్ఠ్‌ మూవీస్‌లో ఆ సినిమాను నిర్మించబోతున్నాడు.ఆ సినిమాలో హీరోయిన్స్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరియు ప్రణీతలను ఎంపిక చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

‘అఆ’ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది.అంతకు ముందే నితిన్‌ కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది.

ఇలా వరుస చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేస్తూ నితిన్‌ పెద్ద హీరో అయ్యాడు అని అనిపించుకుంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube