దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు డిసెంబర్ 12.ఇదే రోజున రజనీకాంత్ తన అభిమానులకు రెండు కానుకలు ఇవ్వనున్నాడని తమిళ వర్గాలు అంటున్నాయి.
అందులో ఒకటి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న రోబో 2 సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తాడట.అంతే కాకుండా ఈ డిసెంబర్ 18 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని సమాచారం.
ఈ సినిమా కోసం లాస్ ఏంజిల్స్‌లో రజనీకాంత్ ఫోటో సెషన్లో కూడా పాల్గొన్నాడట.అలాగే రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం కబాలి.
ఈ సినిమా పోస్టర్స్‌ను రజనీకాంత్ పుట్టినరోజునాడే రిలీజ్ చేస్తారట.
ఇక్కడొక విషయాన్ని ప్రస్తావించాలి.
ప్రస్తుతం తమిళనాడు, ముఖ్యంగా చెన్నై నగరం వరదల్లో చిక్కుకుని ఉంది.ఇలాంటి సమయంలో రజనీకాంత్ తన పుట్టినరోజు వేడుకలను అర్భాటంగా జరుపుకోడని, సినిమాలను కూడా చాలా సింపుల్‌గానే ప్రారంభిస్తాడనేది టాక్.
డిసెంబర్ రెండో వారంతో కబాలి చిత్రాన్ని పూర్తి చేయనున్న రజనీకాంత్ వెంటనే రోబో2లో పాల్గొననుండటం విశేషం.ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా రూపొందనుంది.
ఆర్నాల్డ్ షార్వ్జ్ నెగ్గర్ విలన్‌గా నటించనుండటం గమనార్హం.