రుద్రమపై జక్కన్న స్పందన

గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రుద్రమదేవి’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.

 Rajamouli’s Response On Rudramadevi-TeluguStop.com

కాగా మొదటి నుండి కూడా ఈ చిత్రంపై ఆసక్తిని కనబర్చుతూ వస్తున్న టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి మొదటి రోజే చూశాడు.ఈ చిత్రంపై దర్శకధీరుడు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు.

తన మనస్సుకు నచ్చిన చిత్రాల గురించి నిర్మొహమాటంగా అభిప్రాయాన్ని చెప్పే జక్కన్న తాజాగా ‘రుద్రమదేవి’ చిత్రం బాగుందంటూ తన రివ్యూ ఇచ్చాడు.జక్కన్న ఈ చిత్రంపై సోషల్‌ మీడియాలో స్పందిస్తూ… సినిమా స్లోగా జరుగుతుందని అనిపించిన సమయంలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ వచ్చి చేసిన సందడి సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

బన్నీ ఉన్న అన్ని సీన్స్‌ కూడా బాగా వచ్చాయి.స్క్రీన్‌పై గోనగన్నారెడ్డిగా బన్నీ కనిపించిన తీరు సూపర్‌.

అనుష్క నటన చాలా బాగుంది.ఈ చిత్రం కోసం ఆమె ఎంతగా కష్టపడిరదో, ఎంత అంకిత భావంతో పని చేసిందో అర్థం అవుతోంది.

వీరభద్రుడు మరియు రుద్రమదేవిల మధ్య మరిన్ని సీన్స్‌ ఉంటే బాగుండేది అనిపించింది.ఇక రాజకీయ క్రీడ ఆడిన శివదేవయ్య పాత్రలో ప్రకాష్‌ రాజ్‌ నటన సూపర్‌.

చిత్ర దర్శక నిర్మాత గుణశేఖర్‌ గారికి సక్సెస్‌ సందర్బంగా శుభాకాంక్షలు అంటూ పోస్ట్‌ చేశాడు.జక్కన్న పాజిటివ్‌ రివ్యూతో సినిమాకు మరింత క్రేజ్‌ పెరుగనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube