మెగా హీరోతో జక్కన్న?

టాలీవుడ్‌ దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.గత రెండున్నర మూడు సంవత్సరాలుగా మరే సినిమా గురించి ఆలోచన పెట్టుకోకుండా ‘బాహుబలి’ సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు.

 Rajamouli To Direct Allu Arjun..?-TeluguStop.com

ఎట్టకేలకు ‘బాహుబలి’ షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది.మరో వైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా శరవేగంగా జరుగుతోంది.

రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత జక్కన్న చేసే సినిమా ఏది, హీరో ఎవరు అనే చర్చ ప్రస్తుతం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.అయితే తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

జక్కన్న తన తర్వాత సినిమాను సింపుల్‌గా తెరకెక్కించాలని నిర్ణయించుకున్న విషయం తెల్సిందే.ఇది వరకు ఇకపై తాను భారీ చిత్రాల జోలికి వెళ్లదల్చుకోలేదు అంటూ జక్కన్న ప్రకటించాడు.

ఇక తన తర్వాత సినిమా హీరోను కూడా రాజమౌళి ఎంపిక చేసుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.అల్లు అర్జున్‌తో జక్కన్న తన తర్వాత సినిమాను చెక్కే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు.

గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మించే అవకాశాలున్నాయి.అయితే ప్రస్తుతం ‘బాహుబలి’ చేస్తున్న రాజమౌళి మరో సంవత్సరం వరకు ఫ్రీ అయ్యే అవకాశాలున్నాయి.

అంటే వచ్చే సంవత్సరంలో జక్కన్న మెగా మూవీ ప్రారంభం అయ్యే ఛాన్స్‌ ఉందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube