రానా పెళ్లికి కూడా ఈయనే అడా?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి గత మూడు సంవత్సరాలుగా ‘బాహుబలి’ సినిమా కోసం ప్రభాస్‌, రానాలతో పాటు పలువురు డేట్స్‌ను తీసుకున్న విషయం తెల్సిందే.గత నెలలో ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Rajamouli Reveals Rana Marragie-TeluguStop.com

రెండవ పార్ట్‌ చిత్రీకరణ వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది.వచ్చే సంవత్సరం జులై లేదా ఆగస్టులో ‘బాహుబలి’ పార్ట్‌ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

అప్పటి వరకు ప్రభాస్‌ పెళ్లి చేసుకోడనే విషయం తెల్సిందే.‘బాహుబలి’తోనే రానా పెళ్లి కూడా ముడిపడి ఉందట.

ఈ విషయాన్ని స్వయంగా రానా పేర్కొన్నాడు.

తాజాగా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఆ ఇంటర్వ్యూలో ఆయన సన్నిహితులే ఆయనకు ప్రశ్నలు వేశారు.ఆ సందర్బంగా రానా నా పెళ్లి ఎప్పుడు, నేను సెటిల్‌ అయ్యేది ఎప్పుడు? అంటూ రాజమౌళిని ప్రశ్నించాడు.దాంతో రాజమౌళి పెద్దగా నవ్వుతూ, రెండవ పార్ట్‌ షూటింగ్‌ లెక్కలు వేసుకుని ఇంకా 9 నెలల వరకు రానాకు విముక్తి లేదు అంటూ చెప్పుకొచ్చాడు.దాంతో యాంకర్‌ 9 నెలల తర్వాత రానాకు పెళ్లికి రెడీ అయిపో అంటూ సలహా ఇచ్చింది.

‘బాహుబలి’ పూర్తి అయిన తర్వాత ప్రభాస్‌ మరియు రానాలు పెళ్లి చేసుకుంటారు అనే విషయం తాజాగా క్లీయర్‌ అయ్యి పోయింది.వీరిద్దరికి కూడా ‘బాహుబలి’ సినిమాలో నటించడంతో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో గుర్తింపు వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube