మహేష్ చేతికి రికార్డులు దక్కనివ్వట్లేదు రాజమౌళి-Rajamouli Has Been Stopping Mahesh From Scoring Industry Hits 4 months

Baahubali Dookudu Magadheera Mahesh Babu Rajamouli Rajamouli Has Been Stopping From Scoring Industry Hits Srimanthudu Photo,Image,Pics-

ఈ జెనరేషన్ హీరోల్లో మొదటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన నటుడు మహేష్ బాబు. ఒక్కడుతో మిస్ చేసుకున్నా, పోకిరితో ఇండస్ట్రీ దిమ్మదిరిగే బ్లాక్ బస్టర్ ఇచ్చేసాడు. ఆ తరువాత కొంతకాలం పెద్దగా చప్పుడు చేయలేదు కాని, మళ్ళీ దూకుడుతో భారి విజయాన్ని అందుకున్నాడు సూపర్ స్టార్. నిజానికి ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కావాల్సింది (ఇది ఇండస్ట్రీ హిట్ అని వాదించేవారు ఉన్నారు). కాని రాజమౌళి కళాఖండం మగధీరను దాటలేకపోయింది. అ రకంగా రాజమౌళి గ్రాఫిక్స్ మాయాజాలం వలన తన రెండొవ ఇండస్ట్రీ హిట్ మిస్ చేసుకున్నాడు.

శ్రీమంతుడు బాహుబలి తరువాత అతిపెద్ద హిట్. మళ్ళీ పాతకథే. ఈసారి కూడా రాజమౌళి సృష్టించిన మరో అద్భుతం బాహుబలిని దాటలేకపోయాడు. అదే బాహుబలి లేకపోయింటే, మహేష్ ఖాతాలో మూడొవ ఇండస్ట్రీ హిట్ పడిపోయేది.

ఇప్పుడు, మహేష్ 23వ చిత్రానికి ఓవర్సిస్ లో రికార్డు రేటు చర్చలు జరుగుతుండగానే ఇప్పట్లో అందుకోలేని విధంగా 45 కోట్ల బిజినెస్ చూపించాడు జక్కన్న. ఇక్కడితో ముగిసిపోలేదు, రేపు మహేష్ – మురుగదాస్ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా, శ్రీమంతుడుని దాటడం దాదాపుగా ఖాయం. కాని, బాహుబలి దాకా వెళ్ళలేడు ప్రిన్స్. ఆరకంగా, సినిమా హిట్ అయితే, తన నాలుగొవ ఇండస్ట్రీ హిట్ మిస్ చేసుకుంటాడు మహేష్. మొత్తానికి మహేష్ ని వదలట్లేదుగా మన జక్కన్న.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. టాలీవుడ్‌ను చూసి ఏడుస్తున్నారా..!

About This Post..మహేష్ చేతికి రికార్డులు దక్కనివ్వట్లేదు రాజమౌళి

This Post provides detail information about మహేష్ చేతికి రికార్డులు దక్కనివ్వట్లేదు రాజమౌళి was published and last updated on in thlagu language in category Telugu Gossips,Telugu News.

Rajamouli has been stopping Mahesh from scoring industry hits, Rajamouli, Mahesh Babu, Magadheera, Srimanthudu, Dookudu, Baahubali, AR Murugadoss

Tagged with:Rajamouli has been stopping Mahesh from scoring industry hits, Rajamouli, Mahesh Babu, Magadheera, Srimanthudu, Dookudu, Baahubali, AR Murugadossar murugadoss,baahubali,dookudu,magadheera,Mahesh Babu,rajamouli,Rajamouli has been stopping Mahesh from scoring industry hits,Srimanthudu,,