ఇంగ్లీష్ సినిమాల సీన్లు కాపికొడుతున్న రాజమౌళి?

ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి … హాలివుడ్ సినిమా ఇండస్ట్రీ ఇప్పటికీ మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి మైళ్ళ దూరంలోనే ఉంది.మనం 2017 లో బాహుబలి బాహుబలి అని గర్వపడుతున్నాం కాని ఇలాంటి జానపద గాధలను వాళ్ళు 1990లు, 2000లనుంచే తీసుకుంటూ వచ్చారు.

 Rajamouli Copies Hollywood Scenes For Baahubali 2-TeluguStop.com

హ్యారీపాటర్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, 300 .ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి.ఇక సూపర్ హీరో సినిమాల గురించి చెప్పేదేముంది.కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడుతూ, భారి యాక్షన్ సినిమాలు తీయాలంటే హాలివుడ్ తరువాతే ఎవరైనా.

300 .ఈ సినిమా చూసిన తరువాతే మన జక్కన్న దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోని మగధీర తీసారు.దానికి దీనికి కథ విషయంలో సంబంధం లేకపోయినా, యాక్షన్ ఎపిసోడ్లు కాపి కొట్టేసారు.బాహుబలి కథ హాలివుడ్ లో లేనిదే, యుద్ధసన్నివేశాలు కూడా కాపీ కొట్టకుండా, సొంత ఆలోచనలతో తీసారు.

కాని బాహుబలి 2 కి వచ్చేసరికి మళ్ళీ పాత జక్కన్న బయటకి వచ్చేసాడు.

ట్రైలర్ లో ప్రభాస్ పైకి చూస్తుండగా బాణాల వర్షం కురిసే షాట్ హర్క్యూలెస్ అని సినిమాలోది కాగా, ప్రభాస్ పై మాహిశ్మతి జనాలంతా చేతులు వేసే షాట్ బ్యాట్ మాన్ vs సూపర్ మాన్ సినిమాలోది.

బాహుబలి అంటే ఒక అంతర్జాతీయ ప్రాజక్ట్ లాంటిది.హాలివుడ్ ఆడియెన్స్ కూడా దీనిపై ఓ కన్నేస్తారు.మరి ఇదంతా తెలిసిన రాజమౌళి ఈ తప్పులు ఎందుకు చేసినట్టో!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube