మళ్ళీ కాపి కొట్టిన రాజమౌళి

800 కోట్ల కలెక్షన్లు .1000 కోట్ల వైపు పరుగులు .జకన్న ఐదేళ్ళు కష్టపడి చెక్కిన బాహుబలి మనం ఊహించని కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది.గ్రాఫిక్స్ వర్క్ లో క్వాలిటి చాలా తగ్గిందనే కంప్లయింట్స్ చాలా వస్తున్నాయి, అయినా సరే, రాజమౌళి రాజముద్ర ముందు అవన్ని చిన్నబోయాయి.

 Rajamouli Copied Scenes In Baahubali 2-TeluguStop.com

జనాలు జాతరకి వెళ్ళినట్లు వెళుతున్నారు థియేటర్లకు.అయినా, సినీ అభిమానులకి ఎక్కడో అసంతృప్తి.గ్రాఫిక్స్ వదిలేయండి .200 కోట్ల బడ్జెట్ తో వేలకోట్లతో సినిమాలు నిర్మించే హాలివుడ్ స్థాయిని అందుకోవడం అంత ఈజీ విషయం కాదు.కాని రాజమౌళి మళ్ళీ కాపి కొట్టారు.

300 ఆధారంగా తీసుకోని మగధీర రాసుకుంటే కనిపెట్టేసారు.ఎప్పుడో 1923లో వచ్చిన మై హాస్పిటాలిటి సినిమాని మర్యాదరామన్నగా తీస్తే కూడా నేటి ఇంటర్నెట్ యుగం ప్రేక్షకుల సినిమా జ్ఞానానికి దొరికిపోయారు జక్కన్న.మిగితా సినిమాలు వదిలేయండి, బాహుబలి గురించే మాట్లాడుకుందాం.

పార్ట్ 2 ట్రైలర్ లో ఒక షాట్ హెర్కులెస్ నుంచి, మరో షాట్ బ్యాట్ మెన్ vs సూపర్ మెన్ నుంచి లేపేసారని ఇప్పటికే విమర్శలున్నాయి, ఇక సినిమా చూసిన తరువాత ఇవి ఇంకా ఎక్కవ అయ్యాయి.

కథ విషయంలోకి వెళితే, సొంత తల్లి లేని బాహుబలిని శివగామి ప్రేమగా చూసుకుంటుంది.

ఇది నచ్చని ఆమె సొంత కొడుకు భల్లాలదేవుడు అమెని బాహుబలికి వ్యతిరేకిగా మారుస్తాడు.ఏదైనా రాజమౌళి సినిమా గుర్తుకు వచ్చిందా? హా .అదే ఛత్రపతి.ఆ సినిమా మూలకథ కూడా ఇదే కదా.మరో విషయం ఏమిటంటే ఫస్టాఫ్ లో ఉన్న కుంతల రాజ్యం యుద్ధసన్నివేశంలో ఎద్దులతో ఓ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది చూడండి, అది Netflix లో ప్రసారమయ్యే మార్కోపోలో నుంచి తీసుకున్నది.తేడా ఏమిటంటే, అక్కడ గుర్రాలు ఉంటే ఇక్కడ ఎద్దులు ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube