మన సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లాడు.‘ఈగ’ సినిమాతోనే తెలుగు సినిమా స్టామినాను చెప్పకనే చెప్పిన జక్కన్న ఈసారి ‘బాహుబలి’ సినిమాతో హాలీవుడ్‌ సినిమాలకు ఏమాత్రం తగ్గను అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.

 Baahubali Movie Gets International Recognition-TeluguStop.com

దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రాజమౌళికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చి పెడుతోంది.ఒక్క తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో సైతం ఈ సినిమాను విడుదల చేయాలని జక్కన్న భావిస్తున్నాడు.

తాజాగా ‘బాహుబలి’ చిత్రీకరణ తీరును అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు పరిశీలించారు.

తాజాగా రామోజీ ఫిల్మ్‌ సిటీలోని ‘బాహుబలి’ సెట్స్‌ను, ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్న టెక్నాలజీను, ఇంకా పలు అంశాలను చూసిన ఇంటర్నేషనల్‌ మీడియా వారు అబ్బురపడి పోయారు.

‘బాహుబలి’ సినిమా కోసం జక్కన్న పడుతున్న కష్టాన్ని వారు అభినందించారు.ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని తెలుగు ప్రేక్షకులకుతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్‌ హీరోగా అనుష్క, తమన్నాలు హీరోయిన్‌లుగా రానా విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాను జులైలో విడుదల చేసే అవకాశాలున్నాయి.ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube