షారుఖ్ ఖాన్ సహాయం తీసుకుంటున్న రాజమౌళి

బాహుబలి రెండొవ భాగం థీయేటర్లలో సునామి సృష్టించడానికి మరో మూడున్నర నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి.అందుకే ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేయబోతోంది యూనిట్.

 Exclusive : Baahubali 2 Teaser To Be Attached With Raees Screens-TeluguStop.com

సహజంగా తెలుగు సినిమాలకి టీజర్ ని ఇంత తొందరగా విడుదల చేయడం చాలా అరుదు.కాని, బాహుబలి ఇప్పుడు కేవలం తెలుగు మార్కేట్ సినిమా కాదుగా.

మొత్తం దేశం ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది.అందుకే బాలివుడ్ ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు.

హిందీలో బాహుబలిని కరణ్ జోహర్ తో కలిసి సినిమాని పంపిణీ చేస్తున్న ఏఏ ఫిలిమ్స్, షారుఖ్ ఖాన్ రయీస్ చిత్రాన్ని కూడా పంపిణీ చేస్తున్నారు.దాంతో ఆ సంస్థ రాజమౌళిని సంప్రదించి, రయీస్ థియేటర్లలో బాహుబలి 2 టీజర్ వచ్చేలా ప్లాన్ చేయమని రాజమౌళిని అడగటం జరిగింది.

షారుఖ్ సినిమాతోపాటు టీజర్ థియేటర్లలోకి వెళితే, హిందీ ప్రేక్షకులలో కావాల్సినంత పబ్లిసిటి దొరుకుతుంది కాబట్టి దానికి రాజమౌళి కూడా సరే అనడం జరిగిందట.

అంటే, సంక్రాంతి సమయంలోనో, సంక్రాంతి తరువాతో, బాహుబలి 2 టీజర్ తప్పక విడుదల అవుతుంది అన్నమాట.

ఎందుకంటే రయీస్ విడుదల అయ్యేది జనవరి 25వ తేదీన.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube