రాజా మీరు కేక మూవీ రివ్యూ

చిత్రం : రాజా మీరు కేక

 Raja Meeru Keka Movie Review-TeluguStop.com

బ్యానర్ : కే స్టూడియోస్

దర్శకత్వం : టి.కృష్ణ కిషోర్

నిర్మాత : ఎమ్.రాజ్ కిమార్

సంగీతం : పకల శ్రీచరణ్

విడుదల తేది : జూన్ 16, 2017

నటీనటులు – తారకరత్న, లాస్య, నియోల్ సీన్, రేవంత్ తదితరులు

హీరోగా పెద్దగా రాణించలేకపోయిన తారకరత్న విలన్ గా మాత్రం మంచి పేరు తెచ్చుకున్నాడు.రవిబాబు తీసిన అమరావతిలో తారకరత్న పెర్ఫార్మెన్స్ ని అప్పుడే ఎలా మరచిపోగలం.

రాజా మీరు కేకలో తారకరత్న మరోసారి విలన్ గా ప్రయత్నం చేసాడు.యాంకర్ లాస్య కూడా నటించిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకి వచ్చింది.మరి రాజా మీరు కేక ఎలా ఉందో రివ్యూలో చదవండి.

కథలోకి వెళితే :

నాగరాజు (తారకరత్న) ఓ పెద్ద కంపెనీకి ఓనర్.తన కంపెనీలోనే పనిచేస్తుంటారు రవి (రేవంత్), శశాంక్ (నియోల్), శీను (ఆర్జే హేమంత్), శ్వేత (లాస్య).ముఖ్యమంత్రి (పోసాని) సలహాలతో కంపెనీ డబ్బు రియల్ ఎస్టేట్ లో పెట్టడంతో పార్టనర్స్ కంపెనీలో భాగస్వామ్యాన్ని వెనక్కి తీసుకుంటారు.

దాంతో కంపెనీలో పనిచేస్తున్నవారంతా రోడ్డు మీద పడతారు.ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక శ్వేత ఆత్మహత్య చేసుకుంటుంది.స్నేహితురాలి చావుకి కారణమైన నాగరాజు మీద రవి, శశాంక్, శీను ఎలా పగతీర్చుకున్నారనేది మిగితా కథ.

నటీనటుల నటన :

తారకరత్న మరోసారి తన నటనతో మెప్పిస్తాడు.బిజినెస్ మెన్ గా హుందాతనం చూపిస్తూనే, కథకి అవసరమైన నెగెటివ్ ఎలిమెంట్స్ పండిచాడు.ఒక నార్మల్ అమ్మాయిగా లాస్య తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది.ఇంటింట అన్నమయ్య సినిమా విడుదల కాక ఇన్నిరోజులు డెబ్యూ కోసం వేయిట్ చేసిన రేవంత్ తొలిసినిమా అయినా బాగా చేసాడు.నియోల్ కాస్త హైపర్ యాక్టివ్ గా ఉండే పాత్రకి సరిపోయాడు.ఇక ఆర్జే హేమంత్ షరామాములే.

టెక్నికల్ టీమ్ :

కెమరా వర్క్ ఫర్వాలేదు.ఈ సైజు సినిమాలకి ఇంకా ఎక్కువ ఊహించడం అత్యాశే.రైటింగ్ చాలా యావరేజ్.ఇక్కడే సినిమాకి దెబ్బపడింది.ఎడిటింగ్ చాలా దారుణం.

సీన్స్ సరైన ఫ్లోలో వెళ్ళవు.దాంతో ప్రేక్షకుడు కథలోంచి బయటకి వెళ్ళిపోతాడు.

ప్రొడక్షన్ వాల్యూస్ ఫర్వాలేదు.ఇటు పాటలు, అటు బ్యాక్ గ్రౌండ్ .రెండూ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్లు.

విశ్లేషణ :

ఈ సినిమా సత్యం కంపెనీ కుంభకోణం మీద ఆధారపడి ఉందని బాగా ప్రచారం జరిగింది.ఇంచుమించు అలాంటి కథే.చెప్పాలంటే మంచి పాయుంట్.కాని సీన్లు బాగా రాసుకోలేదు.ఆసక్తిగా మొదలైనా, మధ్యలో తడబడిపోతుంది.ఆ తరువాత మరుసటి సీన్ ఏంటో ఆడియెన్స్ కనిపెట్టేంత ఈజీగా అయిపోతుంది స్కీన్ ప్లే.ఇలాంటి సినిమాలని థ్రిల్లర్ లా టైట్ గా తీయాలి.

కాని సినిమా నత్తనడకన సాగుతుంది.ప్రేక్షకుల చూడాలనుకునే హై టెక్నికల్ వాల్యూస్ లేనప్పుడు సన్నివేశాలు, కథనం బాగా రాసుకోవాలి.

కాని సరైన రైటింగ్ లేక, నటీనటులు మంచి అభినయం కనబర్చినా లాభం లేకుండాపోయింది.

చిన్నగా చెప్పాలంటే, పాయింట్ బాగున్నా, ప్రెజెంటేషన్ బాగా లేని సినిమా ఇది.

ప్లస్ పాయింట్స్ :

* మూలకథ

* ఆర్టిస్టుల నటన

మైనస్ పాయింట్స్ :

* కథనం, రైటింగ్

* సంగీతం

* పట్టుతప్పిన నరేషన్

* టేకింగ్

చివరగా :

కేక పెట్టించని రాజా

తెలుగు స్టాప్ రేటింగ్ : 2.25/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube