నాని మజ్ఞులో రాజ్ తరుణ్ సర్ ప్రైజ్..!

నాచురల్ స్టార్ నాని మజ్ఞుగా మారేందుకు సిద్ధమయ్యాడు.అదే నండి నాని నటిస్తున్న తర్వాత సినిమా మజ్ఞు సెప్టెంబర్లో రాబోతున్న సంగతి తెలిసిందే.

 Raj Tarun Share Screen With Nani ‘majnu’-TeluguStop.com

ఉయ్యాల జంపాల దర్శకుడు విరించి వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియెన్స్ నుండి మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంది.అయితే ఈ సినిమాలో నానితో పాటుగా విరించి వర్మ మొదటి హీరో రాజ్ తరుణ్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నాడట.

యువ హీరోల్లో ఒకరి సినిమా కోసం మరొకరు పని చేస్తుండటం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం నాని కోసం రాజ్ తరుణ్ కూడా సర్ ప్రైజ్ రోల్ చేస్తున్నాడట.

జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా లవ్ ఫెయిల్ అయినా సరే స్టాప్ డ్రింకింగ్ స్టార్ట్ లవింగ్ అనే సరికొత్త ట్యాగ్ తగిలించుకుని వస్తున్నాడు నాని.

రీసెంట్ గా జెంటిల్ మన్ హిట్ తో మంచి జోష్ లో ఉన్న నాని ఈ మజ్ఞుతో కూడా హిట్ కొట్టేయడం ఖాయం అనిపిస్తుంది.ఇక సినిమాకు ఇంకాస్త కలరింగ్ వచ్చేలా నానితో పాటు రాజ్ తరుణ్ ను సినిమాలో భాగం చేస్తున్న విరించి వర్మ తన ద్వితీయ విఘ్నాన్ని ఎలా దాటుతాడో చూడాలి.

ఇక నాని ఇదే కాకుండా నక్కిన త్రినాధ రావు దర్శకత్వంలో ‘నేను లోకల్’ సినిమా చేస్తున్నాడు.దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube