డైలమాలో రాజ్ తరుణ్..! -Raj Tarun In Dilemma For His Next Movies 2 months

Anil Sunkara Debut Director Sanjana Dilemma Hero Raj Tarun Upcoming Movies Vmasi Krishna డైలమాలో రాజ్ తరుణ్..! Photo,Image,Pics-

వరుసగా మూడు సూపర్ హిట్లు కొట్టి కుర్ర హీరోల్లో సంచలనం సృష్టించిన రాజ్ తరుణ్ కెరియర్ ఇప్పుడు అయోమయంలో పడిందని చెప్పాలి. ఒకేసారి మూడు ప్రాజెక్టులకు సైన్ చేయడంతో డైలమాలో పడ్డ రాజ్ ఏ ఒక్కటి ముందుకు కదలలేని పరిస్థితుల్లో ఉండటంతో ఏం చేయాలో తోచట్లేదట. ఏ.కె ఎంటర్టైన్మెంట్స్ తో మూడు సినిమాల అగ్రిమెంట్ చేసుకున్న రాజ్ తరుణ్ దొంగాట ఫేం వంశీ కృష్ణతో సినిమా చేస్తున్నాడు. అయితే అవుట్ పుట్ అంత సాటిస్ఫైడ్ గా రావట్లేదని నిర్మాత అనీల్ సుంకర ఆ సినిమాను కొద్దిరోజులు ఆపాడట.

ఇక అదే బ్యానర్లో మారుతి కథతో ఓ సినిమా రావాల్సి ఉంది అది ఆగినట్టే అని తెలుస్తుంది. సంజన అనే నూతన దర్శకురాలు డైరెక్ట్ చేసే సినిమాలో కూడా రాజ్ తరుణ్ చేస్తాడని ప్రచారం జరిగింది ఇప్పుడు ఆ సినిమా కూడా కష్టమే అంటున్నారు. కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న టైంలో కాస్త సీనియర్లతో తన కుర్రతనం చూపించిన రాజ్ పెద్ద పెద్ద ఆఫర్లను మిస్ చేసుకున్నాడు. ఇక చేస్తున్న సినిమాలు కూడా అంత పర్ఫెక్ట్ గా రాకపోవడంతో ఒక్కసారిగా మనవాడు ఏం చేయాలో అన్న సందేహంలో పడ్డాడట. మరి రాజ్ మళ్లీ హిట్ కొట్టే సినిమా ఎప్పుడు తీస్తాడో చూడాలి.


About This Post..డైలమాలో రాజ్ తరుణ్..!

This Post provides detail information about డైలమాలో రాజ్ తరుణ్..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Hero Raj Tarun, Dilemma, Upcoming Movies, Ak Entertainment, Vmasi Krishna, Anil Sunkara, Debut Director Sanjana, డైలమాలో రాజ్ తరుణ్..!

Tagged with:Hero Raj Tarun, Dilemma, Upcoming Movies, Ak Entertainment, Vmasi Krishna, Anil Sunkara, Debut Director Sanjana, డైలమాలో రాజ్ తరుణ్..!Ak Entertainment,anil sunkara,Debut Director Sanjana,dilemma,Hero Raj Tarun,Upcoming Movies,Vmasi Krishna,డైలమాలో రాజ్ తరుణ్..!,,