బురద బురదగా సచివాలయం .. చిరాకు గా చిత్తడి చిత్తడి .

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం విషయం లో చాలా ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి అవన్నీ దాటుకుని మరీ సచివాలయం నిర్మాణం జరుగుతున్న తరుణం లో ఇప్పుడు మరొక తలనొప్పి పుట్టుకొచ్చింది.ప్రస్తుతం గుంటూరు జిల్లా అంతా వరదలు బాగా ఉన్నాయి.

 Secretariat With Full Of Water-TeluguStop.com

వెలగపూడి దగ్గర రాబోతున్న తాత్కాలిక సచివాలయం బురదలో చిక్కుకుని పోయింది.రెండు రోజులుగా ఈ ప్రాంతం లో వరదల ఎడ తెరపి లేకుండా కురుస్తూ ఉండడం అసలే నల్ల రేగేడు భూమి కావడం తో కాస్త బురద పడగానే అంతా చెత్త చెత్త అయిపోతోంది.

మరోవైపు సచివాలయంలో బుధవారం ప్రారంభించిన బ్లాకుల్లో పనులు ఏమాత్రం పూర్తికాలేదు.

ఓపక్క జోరున వర్షం కురుస్తున్నా సిమెంట్ పనులను నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు.

ఇప్పటికే అమర్చిన కిటికీల నుంచి వర్షపు నీరు ఛాంబర్లలోకి వచ్చేస్తోంది.ఛాంబర్లలో వైరింగ్ పని పూర్తికాలేదు.

వర్కింగ్ స్టేషన్లను నామ్ కేవాస్తేగా అమర్చారు.గోడలకు బదులు జిప్సమ్ షీట్లను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.

వీటికి తుదిరూపు తీసుకొచ్చేందుకు కనీసం నెలరోజుల వ్యవధి పడుతుందని సిబ్బంది చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube