రాహుల్ గాంధీ పంతం

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పంతం పట్టారు.ఈ విషయంలో ఇంత పట్టుదల? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెసెస్ )కు క్షమాపణ చెప్పానని రాహుల్ పంతం పట్టారు.కాషాయ సంస్థతో ఎందుకు గొడవ పెట్టుకుంటావు క్షమాపణలు చెబితే తలనొప్పి పోతుంది కదా అని కోర్టు సలహా ఇచ్చినా వినలేదు.తను కోర్టులో పోరాడతానని అన్నారు.

 Rahul Gandhi Refuses Court Advice-TeluguStop.com

అసలు విషయం ఏమిటంటే ….గత సాధారణ ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు రాహుల్ ఆరెసెస్ మీద విమర్శలు చేస్తూ ఆరేసేస్కు చెందిన నాథూరాం గాడ్సే మహాత్మా గాంధీని చంపాడని అన్నారు.

దీంతో కాషాయ సంస్థకు ఆగ్రహం కలిగింది.తమపై రాహుల్ లేనిపోని నిందలు వేసి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాడని కోర్టులో పరువు నష్టం దావా వేసింది.

ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది.కేసు చాలా కాలంగా కొనసాగుతుండటంతో దీన్ని సెటిల్ చేసుకోమని సుప్రీం కోర్టు రాహుల్కు సలహా ఇచ్చింది.

ఇందుకు రాహుల్ చేయాల్సిన పని ఆరేసేస్కు క్షమాపణ చెప్పడం.అలా చేస్తే కేసు మూసి వేస్తామని కోర్టు చెప్పింది.

కనీ రాహుల్ ఒప్పుకోలేదు.దీంతో కేసు విచారణ వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా పడింది.

రాహుల్ కాషాయ సంస్థకు అపాలజీ చెబితే ఆయన పరువు, కాంగ్రెస్ పరువు పోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube