యమ తొందరపడుతున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ యమ తొందరపడుతున్నారట.ఎందుకు? దేనికోసం ఈ తొందర? రైతుల భూములు లాగేసుకోవాలని ఆయనకు చాలా తొందరగా ఉందని కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు.వివాదాస్పద భూసేకరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందలేని పరిస్థితి ఉండటంతో మోదీ సర్కారు దానిపై మూడోసారి ఆర్డినెన్సు తెచ్చింది.దీంతో రాహుల్‌ ద్వజమెత్తారు.పేద రైతుల, వ్యవసాయ కార్మికుల హక్కుల రక్షణ కోసం కాంగ్రెసు పార్టీ పోరాడుతూనే ఉంటుందన్నారు.సూట్-బూట్‌ సర్కారుకు వ్యతిరేకంగా పోరు కొనసాగిస్తూనే ఉంటామన్నారు.

 Modi In Amazing Hurry-TeluguStop.com

భూసేకరణ విషయంలో ఎనభైశాతం అంగీకారం లేనిదే భూమిని పారిశ్రామిక అవసరాల కోసం సేకరించకూడదంటూ యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో మార్పు చేయాలని మోదీ సక్కారు సంకల్పించింది.మోదీ సర్కారు బిల్లు ప్రకారం రైతులను సంప్రదించకుండానే ఇష్టానుసారం భూమిని కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టొచ్చు.

రైతులకు ఇంత నష్టం కలిగించే బిల్లును భాజపా గట్టిగా సమర్థిస్తోంది.దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఈ బిల్లు చట్టం కావల్సిందేనని ప్రభుత్వం భావిస్తోంది.

కాని కాంగ్రెసు, ఇతర పార్టీలు ఈ బిల్లు విషయంలో గట్టిగా పోరాటం చేస్తున్నాయి.ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube