చిరు 151వ సినిమా దర్శకుడు..!

కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, హీరోగా, దర్శకుడిగా అన్ని విభాగాల్లోనూ రాణించిన రాఘవ లారెన్స్‌ కెరీర్‌కు పునాది రాయి వేసింది మెగాస్టార్‌ చిరంజీవి.కొరియోగ్రాఫర్‌గా లారెన్స్‌ను ఎంకరేజ్‌ చేశాడు.

 Raghava Lawrence To Direct Chiru 151 Film..?-TeluguStop.com

తాను చేసిన పలు సినిమాల్లో లారెన్స్‌కు అవకాశం ఇచ్చాడు.అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న లారెన్స్‌ కొరియోగ్రాఫర్‌గా స్టార్‌ రేంజ్‌కు ఎదిగి పోయాడు.

ఆ తర్వాత దర్శకుడిగా మారడంలో నాగార్జున హెల్ప్‌ చేశాడు.ఇలా లారెన్స్‌ను చిరంజీవి మరియు నాగార్జునలు నిలబెట్టారు.

ఇప్పుడు లారెన్స్‌ స్టార్‌ దర్శకుల జాబితాలో ఉన్నాడు.ఈయన ఇప్పుడు తనకు లైఫ్‌ను ఇచ్చిన చిరంజీవి, నాగార్జునలతో సినిమా చేయాలని ఉవ్విల్లూరుతున్నాడు.

ఇప్పటికే నాగార్జునకు ఒక కథను చెప్పాడు.దానికి నాగ్‌ కూడా ఓకే చెప్పాడు.

అయితే ప్రస్తుతం కమిట్‌ అయిన సినిమాలు పూర్తి అయిన తర్వాత లారెన్స్‌ దర్శకత్వంలో నాగార్జున నటించనున్నాడు.అంటే దానికి కనీసం రెండు సంవత్సరాలు అయినా పడుతుంది.

ఈలోపు మెగాస్టార్‌ను బుట్టలో పడేయాలని లారెన్స్‌ భావిస్తున్నాడు.చిరు రీఎంట్రీ మూవీ ఇటీవలే ఖరారు అయ్యింది.

చిరు 150వ సినిమాకు పూరి జగన్నాధ్‌ దర్శకత్వం వహించనున్నాడు.ఆగస్టులో ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను ఇదే సంవత్సరంలో పూర్తి చేయాలని పూరి భావిస్తున్నాడు.

వెంటనే చిరుతో 151వ సినిమా చేసేందుకు లారెన్స్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇటీవల చిరును కలిసిన లారెన్స్‌ చిన్న స్టోరీ లైన్‌ను కూడా షేర్‌ చేసుకున్నాడు.

అది బాగా నచ్చడంతో పూర్తి కథతో రావాల్సిందిగా లారెన్స్‌కు చిరు చెప్పాడు.దాంతో లారెన్స్‌ ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో చిరు కోసం స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో పడ్డాడు.

లారెన్స్‌ అదృష్టం బాగుంటే చిరు 151వ సినిమా తప్పకుండా చేసే అవకాశం దక్కుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube