టాలీవుడ్‌ను మళ్లీ తిట్టింది

తెలుగులో ‘రక్తచరిత్ర’, ‘ధోని’, ‘లెజెండ్‌’, ‘లయన్‌’ సినిమాల్లో నటించి మంచి పేరుతో పాటు డబ్బును కూడా సంపాదించుకున్న హాట్‌ బ్యూటీ రాధిక ఆప్టే తెలుగు సినిమా ఇండస్ట్రీపైనే విమర్శలు చేస్తూ, తెలుగు ప్రేక్షకుల ఆగ్రహంకు లోనవుతోంది.ఈ అమ్మడు ఆ మధ్య తెలుగులో హీరోల డామినేషన్‌ ఎక్కువగా ఉంటుందని, ప్రేక్షకులు సైతం హీరోయిన్‌ను ఒక గ్లామర్‌ డాల్‌గానే చూస్తారు అంటూ చెప్పుకొచ్చింది.

 Radhika Apte Commens On Tollywood Film Industry-TeluguStop.com

అప్పుడు ఈమె వ్యాఖ్యలను తీసుకున్న సినీ వర్గాల వారు మరోసారి రాధిక అవే వ్యాఖ్యలను చేయడంతో ఇప్పుడు సీరియస్‌ అవుతున్నారు.

తాజాగా ఈమె మరోసారి తెలుగు హీరోల పద్దతిపై, తెలుగు ప్రేక్షకుల టేస్ట్‌పై కామెంట్స్‌ చేసింది.

బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో మాత్రమే హీరోయిన్‌కు కాస్త గౌరవం ఉంటుందని చెప్పుకొచ్చింది.దాంతో తెలుగు ఫిల్మ్‌ మేకర్స్‌ ఈమెపై మండి పడుతున్నారు.

తెలుగులో హీరోల డామినేషన్‌ ఉన్న మాట వాస్తవమే కాని, హీరోయిన్స్‌ను మాత్రం చులకనగా చూసే ప్రసక్తి లేదు అని, అందరు హీరోయిన్స్‌ కేవలం గ్లామర్‌ డాల్‌ పాత్రలే చేయడం లేదని, అనుష్క, సమంత, తమన్నాలాంటి వారు నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటిస్తూ రాణిస్తున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు.మరోసారి రాధిక తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి కామెంట్స్‌ చేస్తే బాగోదంటూ మరి కొందరు ఆమెను హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube