జిమ్ లో రాశీఖన్నా కష్టాలు

ఈకాలం హీరోయిన్లకి కేవలం ఎర్రతోలు ఉంటే సరిపోదు.ఫిగర్ కరెక్టుగా ఉండాలి.

 Raashi Khanna’s Struggle In Gym-TeluguStop.com

అలా ఉండాలంటే ఇష్టమైన తిండ్లు చాలావరకు మానుకోవాలి.జిమ్ కి వెళ్ళాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.అబ్బో, ఒకటా రెండా, కథానాయకుల కంటే ఎక్కువ కష్టపడుతున్నారనుకోండి హీరోయిన్స్.

ఈ మధ్య ఒక టీవిషోలో అలనాటి బాలివుడ్ హీరోయిన్ జూహిచావ్లా మాట్లాడుతూ ” ఈతరం హీరోయిన్లు కష్టపడుతున్నట్లుగా మేం కష్టపడలేదు.అలాంటి అవసరం మాకు రాలేదు.

మేం కాస్త బొద్దుగా ఉన్నా చూసేవారు.ఇప్పుడు అలా కాదు.

హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే ప్రతి సవాలుకి సిద్ధం అవ్వాల్సిందే ” అంటూ నేటి హీరోయిన్ల పరిస్థితి వివరించింది.ఇప్పడు ఇదంతా ఎందుకు అంటే, మన రాశిఖన్నా కష్టాలు అలా ఉన్నాయి.

రాశీ చిన్నప్పుడు చాలా లావుగా ఉండేదట.మోడలింగ్ కోసం సన్నబడింది.

తెలుగులో నటించటం మొదలుపెట్టాక కూడా కాస్త బొద్దుగానే ఉన్న ఈ భామ, తన ఫిగర్ పై విమర్శలు రావడంతో సన్నబడింది.అయినా, రాశీ ఓ సినిమాలో లావుగా, మరో సినిమాలో సన్నగా కనబడుతోంది.

ఇలా ఎందుకు అవుతోంది అంటే, తన శరీర తత్వమే అలాంటిది అని, తక్కువ తింటున్నా లావైపోతున్నానని చెప్పింది రాశీ.అందుకే, అందరు జిమ్ లో గంట గడిపితే, రాశీ మాత్రం రోజుకి రెండు గంటలు జిమ్ కోసం వెచ్చించాల్సి వస్తోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube