అరుణ్‌ జైట్లీ స్తోత్రం

రాజకీయ నాయకులు రెండే పనులు చేస్తారు.మొదటిది ఆత్మస్తుతి.

 Quick, Transparent Decisions-TeluguStop.com

రెండోది పరనింద.నరేంద్ర మోదీ సర్కారు ఏడాది పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఆయన మంత్రులు స్తోత్ర పాఠాలు అంటే ఆత్మస్తుతి మొదలుపెట్టారు.

మోదీని అంతవాడు…ఇంతవాడు అని పొగుడుతున్నారు.ఆయన ప్రభుత్వ పనితీరు బ్రహ్మాండంగా ఉందని విలేకరుల సమావేశాలుపెట్టి ఊదరగొడుతున్నారు.

ఏడాది కాలంలో మోదీ ప్రభుత్వం వేగంగా పనులు చేసిందని, పారదర్శకంగా పనిచేసిందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు.అభివృద్ధి పట్ల సర్కారు స్పష్టమైన అభిప్రాయాలతో ఉందన్నారు.

తమ ప్రభుత్వ పనితీరు గురించి ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పారు.కాని వాస్తవ పరిస్థితి ఇలా లేదని అనేకమంది మేధావులు, విశ్లేషకులు ఘోషిస్తున్నారు.

ఈ ఏడాది మోదీ చేసిన బ్రహ్మాండమైన పని ఏమిటని అడిగితే ఏమీలేదనే చెప్పాలి.దేశంలో ఆయన చేసిన పని తక్కువ.

విదేశాలు మాత్రం బాగా తిరిగొచ్చారు.మోదీ సర్కారు పనితీరుపై ఢిల్లీ ప్రజలు అప్పుడే తీర్పు చెప్పారు.

అదే తీర్పు మరో రెండు రాష్ర్టాల్లో రిపీట్‌ అయితే భవిష్యత్తుపై బెంగ మొదలైనట్లే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube