‘టెంపర్‌’కు హెల్ప్‌ చేసింది ఈయనే?

భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్‌ వరుసగా ఫ్లాప్‌లు ఎదుర్కొంటుండటంతో ఈయన తాజా చిత్రం ‘టెంపర్‌’కు ఆర్థిక ఇబ్బందులు ఎదురయినవి అనే వార్తలు ఆ మద్య వచ్చిన విషయం తెల్సిందే.అందుకే ‘టెంపర్‌’ షూటింగ్‌కు కాస్త ఇబ్బందులు కూడా వచ్చాయని అన్నారు.

 Pvp Financial Help To Bandla Ganesh-TeluguStop.com

అయితే ఆ వార్తలను నిర్మాత బండ్ల గణేష్‌ తోసిపుచ్చాడు.అయితే తాజాగా ఈయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే అని, ఈయనకు ‘టెంపర్‌’ పూర్తి చేసేందుకు ప్రముఖ నిర్మాత పొట్లూరి వి ప్రసాద్‌ ఆర్థిక సాయం చేశాడనే టాక్‌ వినిపిస్తోంది.

పొట్లూరి వి ప్రసాద్‌ ఆర్థిక సాయం చేయకుంటే ఈరోజు ‘టెంపర్‌’ పూర్తి అయ్యేది కాదని కూడా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.అందుకే ‘టెంపర్‌’ ఆడియో వేడుకలో పొట్లూరికి అంత ప్రాముఖ్యత లభించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

తెలుగు తమిళంలో వరుసగా చిత్రాలు నిర్మిస్తూ బిజీగా ఉన్న పొట్లూరి వర ప్రసాద్‌ ఇలా సినిమాలకు ఫైనాన్స్‌ కూడా చేస్తూ ఆ సినిమాల విడుదలలో హెల్ప్‌ చేస్తూ ఉన్నాడు.ఇక ‘టెంపర్‌’ విషయానికి వస్తే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

ఆ అంచనాలను తప్పకుండా అందుకుంటామని ఎన్టీఆర్‌ తాజాగా ఆడియో వేడుకలో గట్టిగానే చెప్పిన విషయం తెల్సిందే.ఈ సినిమా ఫలితం తారుమారు అయితే బండ్ల గణేష్‌కు ఇదే చివరి చిత్రం అవుతుందనే టాక్‌ కూడా ఫిల్మ్‌ వర్గాల్లో వినిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube