మహేష్ మాత్రమే కాపాడాలి

ప.వి.పి బ్యానర్ లో సినిమా అంటే చాలు ఫ్లాప్ అని ట్రేడ్ వర్గాల్లో భయం పుట్టేస్తోంది.దానికి బలమైన కారణం లేకపోలేదు.

 Pvp Cinema In Heavy Losses-TeluguStop.com

అనవసరపు హంగులకు పోతారని, కథ కన్నా కాంబినేషన్ కే ఎక్కువ ప్రధాన్యత ఇస్తారని, అసలు వాళ్లు చేసేది సినిమాలు కాదు, ప్రాజెక్టులు అనే చెడ్డపేరు ఉంది పి.వి.పి కి గమనిస్తే అదే నిజమేమో అనిపిస్తుంది.

అసలు ఏ నమ్మకంతో “వర్ణ” మీద యాభై కోట్లకు పైగా పెట్టారో ఇప్పటికి అంతు చిక్కని విషయం.

దారుణమైన డిజాస్డర్ గా నిలిచింది ఆ చిత్రం.కొత్తగా సైజ్ జీరో గురించి చెప్పుకోవాలి.

అనుష్క ని మాత్రమే నమ్ముకోని భారి బడ్జెట్ తో నిర్మించారు.సినిమాలో పసలేని కథ ఉంది అన్న విషయాన్ని పక్కన పెట్టి ప్రాజెక్టు పూర్తి చేసారు.

రిలీజ్ కి రెండు నెలల ముందే సైజ్ జీరో ఫ్లాప్ అని ట్రేడ్ వర్గాలు చర్చించుకున్నాయి అంటే అర్థం చేసుకోండి పి.వి.పి ప్లానింగ్ ఎంత దారుణమో!

గత రెండు సంవత్సరాల్లో పి.వి.పి 50 కోట్లకు పైగా నష్టపోయింది.ఈ కష్టాల్లోంచి బయటపడేయడం మహేష్ కి మాత్రమే సాధ్యం.

మహేష్ ఉన్నాడన్న నమ్మకంతోనే బయ్యర్లు బ్రహ్మోత్సవం మీద ఆసక్తి చూపిస్తున్నారు.మరి ఈ కష్టకాలం నుంచి పి.వి.పి సంస్థని సూపర్ స్టార్ బయటపడేస్తాడా లేదా అనేది చూడాలంటే ఎప్రిల్ దాకా ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube