లోఫర్ ఆడియో ఫంక్షన్లో పవర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన రచ్చ తెలిసిందే.ప్రభాస్ లాంటి టాప్ హీరో ఉన్నాడన్న జ్ఞానం కూడా లేకుండా పవన్ అభిమానులు ప్రవర్తించిన తీరుని చాలామంది విమర్శించారు.
పవన్ అభిమానుల వ్యవహార శైలిపై పూరి కూడా గుర్రుగా ఉన్నారు.ఇందాకే మీడియాతో మాట్లాడిన పూరి ఈ విధంగా స్పందించారు.
” ‘లోఫర్’ ఆడియో ఫంక్షన్ లో అందరూ చాలా ఇబ్బంది పడ్డారు.నేను, ప్రభాస్ కూడా ఇరిటేట్ అయ్యాం.
మేము ఒక ఫంక్షన్ పెట్టుకుంటే అక్కడ మా సినిమా గురించి చెప్పుకోవాలనుకుంటాము.కాని పవన్ ఫ్యాన్స్ మమ్మల్ని మాట్లాడనివ్వలేదు.
ఇలా చేస్తే పవన్ గారికే చెడ్డపేరు.ఇలాగైతే పవన్ ఫ్యాన్స్ కి కామన్ సెన్స్ లేదు అనుకుంటారు అంతా.
అది వాళ్లకి అర్థం కావట్లేదు.పవన్ గారు చెబితే అర్థం అవుతుందో లేదో కాని ఆయన ఓసారి వాళ్లతో మాట్లాడాలి.” అంటూ పవన్ ఫ్యాన్స్ మీద మండిపడ్డారు పూరి.
ఇకనైన పవన్ ఫ్యాన్స్ బుద్ధి తెచ్చుకోని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటారో , లేదా మా తీరింతే అని విమర్శల పాలవుతూనే ఉంటారో !