పూరి జగన్నాథ్ సపోర్ట్ ఇచ్చేసాడు

అసహనం మీద ఆమీర్ ఖాన్ చేసిన వాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే.దేశవ్యాప్తంగా ఆమీర్ ఖాన్ నామస్మరణ ఇప్పట్లో ఆగేలా లేదు.

 Puri Jagannath Backs Aamir Khan-TeluguStop.com

కొందరు తిట్టుకుంటున్నారు, కొందరు మెచ్చుకుంటున్నారు.కాని ఆమీర్ పేరు మాత్రం మారుమోగిపోతూనే ఉంది.

బీజేపి నిరసన కార్యక్రమాలు చేపడుతోంటే, సినీలోకంలో కొంతమంది ఆమీర్ వైపు మాట్లాడుతున్నారు, మరికొంతమంది ఇకపై మేము నీ అభిమానులం కాదు అని విమర్శిస్తున్నారు.

పూరి జగన్నాథ్ ఈ విషయంపై ట్విట్టర్ లో స్పందించారు.

ఆమీర్ ను వెనకేసుకొచ్చారు.పనిలేని వాళ్ళంతా ఆమీర్ మీద ఎడుస్తున్నారని, ఆమీర్ సెలబ్రిటి కావడంతో ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, అదే ఆమీర్ ఏ తివ్రవాదో అయ్యుంటే ఒక్కడికి కూడా ఆ ధైర్యం ఉండేది కాదని.

ఆమీర్ పడుతున్న బాధలు తెలీయకుండా ఊరికే వివాదం రేపుతున్నారని చెప్పాడు పూరి.

ఆమీర్ తో అవకాశం కోసం పూరి ఇలా చేసాడని కొందరు అంటుంటే, మీడియా మాయలో పడకుండా, ఆమీర్ చెప్పిన మాటల్లోని వాస్తవాలని గమనించి పూరి సపోర్ట్ చేస్తున్నాడని మరికొందరు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube